Begin typing your search above and press return to search.

38 కోట్ల‌తో 5ఎక‌రాల కొనుగోలు చేసిన విరుష్క జంట‌

ముంబైలో వేగంగా ఎదుగుతున్న ప్రాంతాల్లో క‌మ‌ర్షియ‌ల్ భూముల‌పై పెట్టుబ‌డులు పెట్ట‌డం బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు అల‌వాటు వ్యాప‌కం.

By:  Tupaki Desk   |   17 Jan 2026 1:00 AM IST
38 కోట్ల‌తో 5ఎక‌రాల కొనుగోలు చేసిన విరుష్క జంట‌
X

ముంబైలో వేగంగా ఎదుగుతున్న ప్రాంతాల్లో క‌మ‌ర్షియ‌ల్ భూముల‌పై పెట్టుబ‌డులు పెట్ట‌డం బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు అల‌వాటు వ్యాప‌కం. అమితాబ్ బ‌చ్చ‌న్, షారూఖ్‌, దీపిక‌, అభిషేక్, హృతిక్ రోష‌న్, సోన‌మ్ కపూర్, వివేక్ ఒబెరాయ్, బోనీక‌పూర్, జాన్వీ .. ఇంకా చాలా మంది రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఖ‌రీదైన ఫ్లాట్లు కొన్నారు.

అయితే బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను మించి రియ‌ల్ ఎస్టేట్ లో పెట్టుబ‌డులు పెట్ట‌డంలో స్టార్ క్రికెట‌ర్లు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు మరోసారి రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టారు. ముంబైకి సమీపంలోని పర్యాటక ప్రాంతం అలీబాగ్‌లో వీరు దాదాపు రూ. 38 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారు.

ఈ డీల్ వివ‌రాల్లోకి వెళితే.. మొత్తం 5.19 ఎకరాల (సుమారు 21,010 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉన్న రెండు పక్కపక్కనే ఉన్న ప్లాట్లను వీరు కొనుగోలు చేశారు. అలీబాగ్‌లోని జిరాద్ గ్రామంలో ఈ భూమి ఉంది. ఇది ఆవాస్ బీచ్‌కు అతి సమీపంలో ఉంటుంది. ఈ రెండు ప్లాట్ల ధర కలిపి రూ. 37.86 కోట్లు. రిజిస్ట్రేషన్ కోసం వీరు ప్రభుత్వానికి రూ. 2.27 కోట్లు స్టాంప్ డ్యూటీగా చెల్లించారు.

అలీబాగ్‌లో విరుష్క జంట‌కు ఇది రెండో పెద్ద పెట్టుబడి. 2022లో ఇదే ప్రాంతంలో 8 ఎకరాల భూమిని రూ. 19 కోట్లతో కొనుగోలు చేసి, అక్కడ ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్‌ను నిర్మించుకున్నారు. 13 జనవరి 2026న ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయింది. విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ, అనుష్క తండ్రి కల్నల్ అజయ్ శర్మ ఈ వ్యవహారాలను దగ్గరుండి పూర్తి చేశారు.

అలీబాగ్ చాలా మంది సెల‌బ్రిటీల‌కు ఆవాసంగా ఉంది. ఇక్క‌డ‌ ఇప్పటికే షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనె వంటి ప్రముఖులకు సొంత ఇళ్లు ఉన్నాయి. ఇప్పుడు విరుష్క జంట ఈ ప్రాంతంలో తమ ఆస్తులను పెంచుకుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో బిజీగా ఉండగా బిజినెస్ వ్య‌వ‌హారాలు, స్థిరాస్తుల‌ను పెంచుకోవడంలోను దూకుడుగా ఉన్నాడు.