అనవసర విషయాలపై ఫోకస్ చేస్తున్నారు..
తాజాగా ఈ విషయంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ పాడ్‌కాస్ట్ లో మాట్లాడింది.
By: Tupaki Desk | 30 May 2025 11:19 AM ISTప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. అవసరానికి మించి దాన్ని వినియోగించడంతో ప్రతీదీ డిస్కషన్ కు దారి తీస్తుంది. ఈ కారణంగానే ఎవరేం చేసినా క్షణాల్లో ఆ వార్త నెట్టింట వైరల్ అయిపోతుంది. అందులో సెలబ్రిటీలకు సంబంధించిన విషయమైతే మరీ వేగంగా వైరల్ అవుతూ ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.
ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ సాధారణ మనుషుల్లానే వాళ్లు కూడా కొన్నిసార్లు అనుకోకుండా తప్పులు చేస్తుంటారు. మొన్నామధ్య అవనీత్ కౌర్ ఫ్యాన్ పేజ్ లోని ఓ పోస్ట్ ను స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుకోకుండా లైక్ చేయడం సోషల్ మీడియాలో ఎంత పెద్ద చర్చనీయాంశమైందో తెలిసిందే. దానిపై కోహ్లీ క్లారిటీ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం దాన్ని మర్చిపోలేదు.
విరాట్ పొరపాటున ఓ పోస్ట్ కు లైక్ చేయడం వల్ల అవనీత్ కు ఏకంగా 2 మిలియన్ల మంది ఫాలోవర్లు పెరిగారు. ఈ లైక్ విషయంపై విరాట్ కోహ్లీ రెస్పాండ్ అయి, తాను తన ఇన్‌స్టా ఫీడ్ ను క్లియర్ చేస్తున్న టైమ్ లో పొరపాటున లైక్ బటన్ నొక్కుకుపోయి ఆ పోస్ట్ లైక్ చేశానని, దాని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని, అనవసరంగా లేనిపోనివి సృష్టించొద్దని ఆయన కోరినప్పటికీ కోహ్లీ లైక్ తర్వాత ఆమెకు ఫాలోవర్లతో పాటూ, ప్రమోషన్ల ఛాన్సులు కూడా ఎక్కువయ్యాయని బాలీవుడ్ లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ విషయంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ పాడ్‌కాస్ట్ లో మాట్లాడింది. సోషల్ మీడియా వాడకం బాగా ఎక్కువైపోయి, ప్రజలు అనవసర విషయాలపై ఫోకస్ చేస్తున్నారని రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది. అవనీత్ పోస్ట్ ను విరాట్ పొరపాటున లైక్ చేయడంతో ఆమెకు 2 మిలియన్ల ఫాలోవర్ల పెరగడం విచిత్రంగా ఉందని, ఇదంతా చూస్తుంటే తనకు చాలా బాధేస్తుందని, మనం ఇంత ఖాళీగా ఉన్నామా అనిపిస్తుందని రకుల్ చెప్పింది.
విరాట్ నిజంగానే ఆ పోస్ట్ ను లైక్ చేశాడా లేదా పొరపాటున అలా జరిగిందా అనే విషయాన్ని కూడా ఎవరూ ఆలోచించలేదని, ఒక్కోసారి మనం ఇన్‌స్టాలో పొరపాటున మన ఫ్రెండ్స్ ను కూడా అన్‌ఫాలో చేస్తుంటాం. అలాంటి పొరపాటే విరాట్ విషయంలో జరిగి ఉండొచ్చనే ఆలోచన కూడా ఈ రోజుల్లో ఎవరూ చేయలేకపోతున్నారు. సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా వైరల్ చేయడం ఎంతో బాధాకరమని, సెలబ్రిటీలకు చెందిన ప్రతీ విషయాన్నీ నెటిజన్లు అతిగా పట్టించుకుంటూ సోషల్ మీడియాలో టైమ్ వేస్ట్ చేస్తున్నారని, తన వరకైతే ఇది పూర్తిగా టైమ్ వేస్ట్ అని రకుల్ చెప్పుకొచ్చింది.
