Begin typing your search above and press return to search.

పెద‌కాపు హీరో ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్.. నెక్ట్స్ లెవెల్ అంతే!

అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోంది.

By:  Tupaki Desk   |   3 Jun 2025 3:04 PM IST
పెద‌కాపు హీరో ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్.. నెక్ట్స్ లెవెల్ అంతే!
X

పెద కాపు అనే యాక్ష‌న్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన విరాట క‌ర్ణ ఆ సినిమాలో ఓ గ్రామీణ యువ‌కుడి పాత్ర‌లో చాలా స‌న్న‌గా క‌నిపించాడు. వాస్త‌వానికి పెద కాపు సినిమా రెండు భాగాలుగా రావాలి. కానీ మొద‌టి పార్టుకు అనుకున్న ఫ‌లితం రాక‌పోవ‌డంతో పెద‌కాపు2ను మేక‌ర్స్ ఆపేశారు. ప్ర‌స్తుతం విరాట్ క‌ర్ణ నాగ బంధం అనే భారీ బ‌డ్జెట్ సినిమాలో న‌టిస్తున్నాడు.


అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోంది. అయితే ఈ సినిమాలో విరాట్ పాత్ర కొన్ని ప్రాణాంత‌క‌మైన విన్యాసాలు చేయాల్సి రావ‌డంతో అత‌ను బ‌రువు పెరిగి లావుగా కనిపించాల్సి వ‌చ్చింది. క్యారెక్ట‌ర్ డిమాండ్ చేయ‌డంతో విరాట్ క‌ర్ణ త‌న‌ను తాను చాలా అద్భుతంగా మేకోవ‌ర్ చేసుకున్నాడు.


ఈ సినిమా కోసం విరాట్ క‌ర్ణ పూర్తిగా కండ‌లు తిరిగిన శ‌రీరంతో చాలా గొప్ప ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ చేశాడు. దీని కోసం విరాట్ ఎంతో క‌ష్ట‌మైన వ‌ర్క‌వుట్స్ చేసి, ప్రొఫెష‌న‌ల్ ట్రైన‌ర్ల ద‌గ్గ‌ర రోజుకు 5 గంట‌ల పాటూ క‌ష్ట‌ప‌డ్డాడ‌ట‌. కేవ‌లం జిమ్ లో వ‌ర్క‌వుట్స్ మాత్ర‌మే కాదు, దీని కోసం త‌న డైట్ ప్లాన్ ను కూడా పూర్తిగా మార్చేసి, త‌న‌ను తాను మేకోవ‌ర్ చేసుకోవ‌డం కోసం ఫిజిక‌ల్ గానూ, మెంట‌ల్ గానూ త‌న‌ను తాను మోటివేట్ చేసుకుని మొత్తానికి అనుకున్నది సాధించాడు.

ప్ర‌స్తుతం విరాట్ కండ‌లు తిరిగిన దేహంతో ఎంతో స్ట్రాంగ్ గా క‌నిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే పెద కాపు లో చూసిన విరాట్ ఇత‌నేనా అనేలా త‌న‌ను తాను మార్చుకున్నాడు. ఇదంతా విరాట్‌కు సినిమా మీదున్న ప్యాష‌న్, డెడికేష‌న్ ను తెలియ‌చేస్తుంది. విరాట్ మేకోవ‌ర్ ఎంతోమందికి స్పూర్తిగా కూడా నిలుస్తుంది. పెద‌కాపులో అప్పుడు చాలా స‌న్న‌గా క‌నిపించిన విరాట్ జ‌ర్నీని చూస్తే ఎవ‌రైనా ప్ర‌శంసించాల్సిందే. నాగ బంధం సినిమా విష‌యానికొస్తే ఈ సినిమాలో న‌భా న‌టేష్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, కిషోర్ అన్న‌పురెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.