వందల కోట్లు ఉన్నా 'విరుష్క' సాదా సీదా జీవనం?
శ్రీకృష్ణ భగవానుడు ప్రవచించిన గీతా సారాన్ని ఔపోషణ పట్టిన చాలా మంది ఇప్పుడు మానసిక ఆనందం గురించే ఆలోచిస్తున్నారు
By: Tupaki Desk | 14 May 2025 4:22 AMడబ్బుతో అన్ని సమస్యలకు పరిష్కారం లేదు. మానసికంగా బావుంటేనే అన్నీ బావున్నట్టు. శ్రీకృష్ణ భగవానుడు ప్రవచించిన గీతా సారాన్ని ఔపోషణ పట్టిన చాలా మంది ఇప్పుడు మానసిక ఆనందం గురించే ఆలోచిస్తున్నారు. భౌతిక పరమైన సౌఖ్యాలు, డబ్బు కంటే ప్రభావవంతమైనది మానసిక ఆనందం మాత్రమేనని గ్రహిస్తున్నారు. పర్యవసానంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, బిగ్ బి అమితాబ్ వంటి ప్రముఖులు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నారు.
ఇదిగో ఇక్కడ విరుష్క జంట కూడా అదే చేస్తోంది. అయితే విరాట్ కోహ్లీ- అనుష్క దంపతులు చాలా కాలంగా గురువు సన్నిధానంలో ఆధ్యాత్మిక చింతనను అలవరుచుకోవడం, సాదా సీదా జీవితం గడపడంపై దృష్టి సారించారు. వందల కోట్ల ఆస్తులు ఉన్నా మనసుకు ఆనందాన్నిచ్చేది అనుసరించడానికే వారు సిద్ధమయ్యారు. రెండేళ్లుగా ఈ దంపతులు అంతర్జాతీయ కృష్ణ సమాజం (ఇస్కాన్)ని అనుసరిస్తున్నారు. లండన్ లో రెగ్యులర్ గా లార్డ్ శ్రీకృష్ణుని సన్నిధానంలో భజన్స్, కీర్తన్స్ కి వెళుతున్నారు. ముంబైలోను ఇస్కాన్ సన్నిధానంలో సాంత్వన పొందుతున్నారు.
గురువు మాత్రమే సరైన మార్గాన్ని భోధించగలడు. అందుకే వీలున్నప్పుడల్లా గురువును కలిసి ఆశీర్వాదాలు పొందుతున్నారు. ముఖ్యంగా వృందావన్ లోని ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లి స్వామివారి దివ్యమైన ఆశీస్సలు కోరారు. మహరాజ్ ప్రవచనాలను వినేందుకు ఆచరించేందుకు ఈ జంట అమితాసక్తిని కనబరుస్తున్నారు. విరాట్ కోహ్లీ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నట్టు, సామాన్యుడిలా సాదా సీదా తెల్ల చొక్కా తొడుక్కుని గురు దేవుల చెంతకు చేరాడు. అంతటి కోటీశ్వరుడైన విరాట్ కోహ్లీ ఎలా పాదాలపై వంగాడో చూస్తున్నారు కదా! ఒదిగి ఉంటేనే ప్రశాంతత. టీనేజ్, యంగ్ ఏజ్ లో లవర్ బోయ్ , రోమియోలా కథానాయికలతో డేట్ చేసిన కోహ్లీయేనా ఈయన అనిపించక మానదు.
ఇస్కాన్ పరిచయంతో లైఫ్ గేమ్ ఛేంజర్ గా మారిందని అంగీకరించాలి. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఎంతో గ్లామరస్ కథానాయికగా ఇండస్ట్రీలో కొనసాగింది. కానీ ఇప్పుడు ట్రెడిషన్ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఎంతో డిగ్నిఫైడ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. విశృంఖలత, గ్లామర్ షోస్, ఎక్స్ పోజింగ్ కి దూరంగా, మారిన నటిగా కనిపిస్తోంది. ఇస్కాన్ ఆచారాలు, సంస్కృతి సాంప్రదాయాలు అన్నివేళలా మనిషికి ఆరాలా పని చేస్తాయనడంలో సందేహం లేదు. ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యులు, గురువులు ప్రభుపాద్ సూచించిన పది సూత్రాలు పాటిస్తే మనిషికి చాలా కష్టాలు మటుమాయమవుతాయని భక్తులు నమ్ముతారు. 27 జూన్ జగన్నాథ రథయాత్రలో పాల్గొనేందుకు విరుష్క జంట ఇప్పటి నుంచే సంసిద్ధతతో ఉందని తెలుస్తోంది.