Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియో : పాక్‌ లో నీ అవ్వ తగ్గేదే లే

సోషల్ మీడియాలోని రీల్స్ మరియు షార్ట్‌ వీడియోలతో పుష్ప సినిమాలోని ఐకానిక్‌ స్టెప్స్ మరియు మ్యానరిజం మూమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా తెగ పాపులారిటీని సొంతం చేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   13 Feb 2024 1:19 PM GMT
వైరల్‌ వీడియో : పాక్‌ లో నీ అవ్వ తగ్గేదే లే
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలోని రీల్స్ మరియు షార్ట్‌ వీడియోలతో పుష్ప సినిమాలోని ఐకానిక్‌ స్టెప్స్ మరియు మ్యానరిజం మూమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా తెగ పాపులారిటీని సొంతం చేసుకున్నాయి.

శ్రీవల్లి పాటలో చెప్పు వదిలేసి వేసిన డాన్స్‌, నీ అవ్వ తగ్గేదే లే అంటూ గదమ కింద చేయి పోనిచ్చి చెప్పే డైలాగ్ ఇలా చాలా ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్‌ అయిన విషయం తెల్సిందే. ఇండియన్ సినిమాలకు పాకిస్తాన్‌ లో కూడా మంచి ఆధరణ లభిస్తూ ఉంటుంది అనే విషయం తెల్సిందే.

తాజాగా ఒక తెలుగు యూట్యూబర్‌ పాకిస్తాన్‌ లో పర్యటించిన సమయంలో అక్కడి వారితో తెలుగు సినిమాల గురించి మాట్లాడించడం జరిగింది. అప్పుడే పుష్ప సినిమా పేరు చెప్పగానే పాకిస్తాన్‌ వ్యక్తి అల్లు అర్జున్‌ స్టైల్‌ లో నీ అవ్వ తగ్గేదే లే అంటూ హిందీ డైలాగ్ ను చెప్పాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. పాకిస్తాన్‌ లో కూడా పుష్ప కి ఏ స్థాయి ఆధరన ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

ఇక పుష్ప సీక్వెల్‌ విషయానికి వస్తే ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు లో సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. సీక్వెల్‌ కచ్చితంగా వెయ్యి కోట్ల మూవీ అంటూ మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.