ఇద్దరు అమ్మాయిల పెళ్లి ఇదో ఇంట్రెస్టింగ్!
తాజాగా ఓ ఇద్దరు లేడీలు చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే.
By: Tupaki Desk | 2 July 2025 4:47 PM ISTఇండస్ట్రీలో ప్రచారం ఎవరి ఇష్టాను సారం వాళ్లు చేసుకుంటారు. ఎవరు ఎలా చేసినా అంతిమంగా కంటెంట్ జనాలకు రీచ్ అయిందా? లేదా? అన్నదే ముఖ్యం. అందుకోసం ఎలాంటి దారులైనా ఎంచుకుం టారు. ప్రచారం పరంగా ఎవరి స్ట్రాటజీ వారిది. అది ఒక్కోసారి కలిసొస్తుంది. ఒక్కోసారి బెడిసి కొడుతుంది. ఏం జరిగినా లైట్ తీసుకుని ముందుకెళ్లిపోవమే. ఇది సోషల్ మీడియాలో యుగంలో అందరికీ బాగా అలవాటైన పనే.
తాజాగా ఓ ఇద్దరు లేడీలు చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే. ముక్కు ముఖం తెలియని మగాళ్లను పెళ్లి చేసుకుని చిత్రహింసలు పడటం కంటే? బెస్ట్ ప్రెండ్స్ అయిన ఇద్దరు లేడీలు పెళ్లి చేసుకోవడం ఉత్తమం అనుకుని మోడల్ అన్సియా- మలయాళ బుల్లి తెర నటి ప్రార్ధనా కృష్ణ నాయర్ వివాహం చేసుకున్నారు. ఇద్దరు దండలు మార్చుకున్నారు. ఒకరు పసుపు తాడు కట్టారు. నుదిటిన కుంకుమ దిద్ది జంటగా మారారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గామారింది. ఆడవాళ్లు ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి? వీళ్లకి ఏమైనా పిచ్చా? అంటూ నెటిజనులు దాడి చేస్తున్నారు. కానీ అసలు సంగతి తెలిస్తే స్టన్ అవ్వాలి. ఇదంతా షూటింగ్ లో భాగంగా ఇద్దరు అలా చేసారు అన్న సంగతి చివర్లో రివీల్ చేసారు. వేరే పరిశ్రమకు చెందిన నటులు ఇలాగే ట్రై చేసి సక్సెస్ అయ్యారు. అందుకే తాము ఇలా చేసి వైరల్ అయ్యామని చల్లగా కబురు చెప్పారు.
కానీ బాక్స్ లో కామెంట్లు మాత్రం వేరే లెవల్లో పడుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి వీడియోలు చాలా మంది చేసారు. కొత్తగా మీరు చేసిందేంటి? అందులో క్రియేటివిటీ ఏముంది? వేరే వాళ్ల కాన్సెప్ట్ మీరు కాపీ కొట్టారు. లేడీస్ కావడంతో నెట్టింట వైరల్ అయ్యారు. అంతకు మించి మీ క్రియేటివిటీ ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
