Begin typing your search above and press return to search.

వింటేజ్ ప్రభాస్.. ఆ రోజు ఉదయాన్నే సర్ ప్రైజ్

ప్రభాస్- మారుతి కాంబినేషన్‍లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‍ ను జనవరి 15వ తేదీ ఉదయం 7 గంటల 8 నిమిషాలకు రివీల్ చేయనున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 9:51 AM GMT
వింటేజ్ ప్రభాస్.. ఆ రోజు ఉదయాన్నే సర్ ప్రైజ్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇటీవలే సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీలో నటిస్తున్నారు. మే9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. దీంతోపాటు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్‍ కు డేట్ ను మూవీ టీమ్ ప్రకటించింది.


ప్రభాస్- మారుతి కాంబినేషన్‍లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‍ ను జనవరి 15వ తేదీ ఉదయం 7 గంటల 8 నిమిషాలకు రివీల్ చేయనున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్‍ ను తీసుకురానుంది. దీంతో ప్రభాస్ అభిమానులకు పండగ పూట పొద్దున్నే అదిరిపోయే గిఫ్ట్ వచ్చేయనుంది.

ఉదయించే సూర్యుడు, అరుస్తున్న కోడిపుంజుతో టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ ను చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. "సంక్రాంతి రోజు.. సూర్యోదయంతో పాటు.. రెబల్ స్టార్ కూడా త్వరగా ఉదయించి మీ అందరికీ డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ జనవరి 15వ తేదీ ఉదయం 7 గంటల 8 నిమిషాలకు ఆవిష్కరించనున్నాం. ప్రభాస్ పొంగల్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండి" అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. వింటేజ్ డార్లింగ్ ప్రభాస్ మీ ముందుకు వచ్చేస్తున్నారని చెప్పింది.

అయితే ఈ మూవీ హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతోందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్.. ఫుల్ ఫన్ ఉండే క్యారెక్టర్ చేస్తున్నారని సమాచారం. డార్లింగ్ సినిమా లాంటి క్యారెక్టరైజేషన్ ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో వింటేజ్ ప్రభాస్‍ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఫ్యాన్స్ తెలిపారు.

ఈ చిత్రానికి రాజా డీలక్స్ గా టైటిల్ ఖరారు చేసినట్లు గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు మేకర్స్ టైటిల్ ను మార్చేయాలనుకున్నారట. పాన్ వరల్డ్ లెవెల్ లో ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని టైటిల్ ను రాజా సాబ్ గా మారుస్తున్నారట. మొదట ఈ మూవీని తెలుగులో మాత్రమే విడుదల చేయాలనుకున్నా.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తారట. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనేక సర్ ప్రైజ్ లు ఉండనున్నాయట.