Begin typing your search above and press return to search.

వింటేజ్ మెగా కామెడీ.. మళ్ళీ ఆ రేంజ్ లో..

ఇప్పుడు అలాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కథనే మెగాస్టార్ కోసం అనిల్ రావిపూడి సిద్ధం చేశాడంట. కామెడీ పండించడంలో అనిల్ రావిపూడికి మంచి రైటింగ్ స్కిల్ ఉంది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 4:02 AM GMT
వింటేజ్ మెగా కామెడీ.. మళ్ళీ ఆ రేంజ్ లో..
X

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి అనిల్ రావిపూడి. రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అనిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ దర్శకుడిగా అనిల్ రావిపూడికి ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ 157 సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడిగా ఫైనల్ అయినట్లు సమాచారం. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించబోతున్నారంట. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన చర్చలు కూడా జరిగాయని సమాచారం. అయితే ఈ సినిమాని అనిల్ రావిపూడి కంప్లీట్ కమర్షియల్ యాక్షన్ జోనర్ లో కాకుండా కొత్తగా ట్రై చేయబోతున్నాడంట.

చిరంజీవి కెరియర్ ఆరంభంలో చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ చంటబ్బాయ్. ఈ సినిమాని ఇప్పటి చాలా మంది ఆశ్వాదిస్తూ ఉంటారు. చిరంజీవిలో కామెడీ టైమింగ్ ఉందనే విషయాన్ని కూడా ఈ సినిమా పరిచయం చేసింది. కావాల్సినంత హ్యూమర్ ని చంటబ్బాయ్ చిత్రంలో జెనరేట్ చేశారు. డిటెక్టివ్ కామెడీగా వచ్చిన ఈ మూవీ మెగాస్టార్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఉంటుంది.

ఇప్పుడు అలాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కథనే మెగాస్టార్ కోసం అనిల్ రావిపూడి సిద్ధం చేశాడంట. కామెడీ పండించడంలో అనిల్ రావిపూడికి మంచి రైటింగ్ స్కిల్ ఉంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం అలాంటి కంప్లీట్ హ్యూమర్ పాయింట్ ని ఎంచుకున్నాడంట. ఇప్పుడు దానిపైన వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి చంటబ్బాయ్ లాంటి సినిమా మళ్ళీ పడితే బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అనే మాట మెగా అభిమానుల నుంచి వినిపిస్తోంది. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తూనే అనిల్ రావిపూడి మూవీ కూడా వచ్చే ఏడాది పట్టాలు ఎక్కించే అవకాశం ఉందని టాక్.