Begin typing your search above and press return to search.

రాజమౌళి దారిలో వెళ్తున్న వినోద్‌ చోప్రా...!

ఇప్పుడు రాజమౌళి ఇండిపెండెంట్ గా వెళ్లినట్లుగానే దర్శకుడు వినోద్ చోప్రా కూడా జనరల్‌ కేటగిరీలో తన సినిమా '12th ఫెయిల్‌' సినిమాను ఆస్కార్‌ నామినేషన్‌ కి పంచించాడు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 1:30 PM GMT
రాజమౌళి దారిలో వెళ్తున్న వినోద్‌ చోప్రా...!
X

టాలీవుడ్‌ జక్కన్న తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాకి కొత్త దారులు చూపించారు అనడంలో సందేహం లేదు. కంటెంట్‌ ఉన్న సినిమాలపై రూపాయి పెడితే పది రూపాయల లాభం లాబట్టుకోవచ్చు అనే సూత్రం ను రాజమౌళి మొదలు పెట్టగా, ఇప్పుడు చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ కంటెంట్‌ పై నమ్మకంతో భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.

సినిమాల మేకింగ్‌ విషయంలోనే కాకుండా పబ్లిసిటీ, ఇతర విషయాల్లోనూ రాజమౌళిని ఫాలో అవ్వచ్చు. ఆయన పాటించే పద్దతుల్లో వెళ్లడం వల్ల ఖచ్చితంగా లాభం తప్ప నష్టం ఉండదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తన ఆర్‌ఆర్ఆర్‌ సినిమా ఆస్కార్‌ బరిలో ప్రభుత్వం తరపున అధికారికంగా నిలువక పోవడంతో ఇండిపెండెంట్‌ గా నామినేషన్స్‌ కి పంపించడం జరిగింది.

రాజమౌళి పట్టుబట్టి ఇండిపెండెంట్‌ నామినేషన్ కి పంపించడం మాత్రమే కాకుండా భారీ ఎత్తున ఖర్చు చేసి పబ్లిసిటీ కూడా చేయడం జరిగింది. జక్కన్న కష్టం ఫలించి నాటు నాటు పాటకి ఆస్కార్‌ అవార్డు దక్కి మొత్తం భారత సినీ పరిశ్రమ మరియు ప్రేక్షకులు గర్వించారు.

ఇప్పుడు రాజమౌళి ఇండిపెండెంట్ గా వెళ్లినట్లుగానే దర్శకుడు వినోద్ చోప్రా కూడా జనరల్‌ కేటగిరీలో తన సినిమా '12th ఫెయిల్‌' సినిమాను ఆస్కార్‌ నామినేషన్‌ కి పంచించాడు. ఈ సినిమా చిన్న సినిమాగా రూపొంది, సాదా సీదా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఒక నిరుపేత గ్రామీన యువకుడు 12th క్లాస్ ఫెయిల్‌ అవుతాడు. ఆ తర్వాత పట్టుదలతో మళ్లీ చదవాలని నిర్ణయించుకుని, 12th పాస్ అవ్వడం మాత్రమే కాకుండా ఉన్నత చదువులు చదివి ఏకంగా ఐపీఎస్‌ అవుతాడు. ఆ యువకుడి పాత్రలో మీర్జాపూర్ ఫేం విక్రాంత్ మస్సే నటించాడు.

విభిన్న కథ తో రూపొందిన ఈ సినిమా ఆస్కార్‌ కి అర్హం. అందుకే ఈ సినిమాను నామినేట్‌ చేయాలని ఇండిపెండెంట్‌ గా నామినేషన్ వేసినట్లుగా పేర్కొన్నారు. మరి రాజమౌళి టీం మాదిరిగా ఆస్కార్ దక్కేనా చూడాలి.