Begin typing your search above and press return to search.

స‌హాయ‌కురాలిపై విన్ డీసెల్ లైంగిక వేధింపులు

అయితే ఇప్పుడు ప్ర‌ముఖ హాలీవుడ్ యాక్ష‌న్ హీరో, ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ ఫేం విన్ డీసెల్ త‌న అసిస్టెంట్ పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

By:  Tupaki Desk   |   22 Dec 2023 5:56 AM GMT
స‌హాయ‌కురాలిపై విన్ డీసెల్ లైంగిక వేధింపులు
X

#Metoo ఉద్య‌మంలో హార్వే వీన్ స్టీన్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖ హాలీవుడ్ స్టార్లు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ లైంగిక వేధింపులు బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. వీన్ స్టీన్ పై సుదీర్ఘ కాలం విచార‌ణ సాగింది. అత‌డు జైలు శిక్ష‌ను అనుభ‌విస్తున్నాడు. ఇలాంటి మాన్ స్టార్స్ పేర్లు చాలా గ‌తంలో వెలుగు చూసాయి. అయితే ఇప్పుడు ప్ర‌ముఖ హాలీవుడ్ యాక్ష‌న్ హీరో, ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ ఫేం విన్ డీసెల్ త‌న అసిస్టెంట్ పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం అత‌డిపై కోర్టుల ప‌రిధిలో విచార‌ణ జ‌రుగుతోంది.

అత‌డు హోట‌ల్ గ‌దిలో త‌న‌పై బ‌లాత్కారానికి పాల్ప‌డ్డాడ‌ని... త‌న వ‌క్షోజాల‌ను బ‌ల‌వంతంగా చేతుల‌తో ఒత్తాడ‌ని, పె*స్ ప‌ట్టుకోమ‌ని బ‌ల‌వంతం చేసాడ‌ని, గోడ‌కు కొట్టి త‌న ముందే మా**ర్ బ్యాట్ చేసాడ‌ని మాజీ స‌హాయ‌కురాలైన అస్తా జ‌నాస‌న్ ఆరోపించింది. ప‌లువురు మ‌హిళ‌ల‌తో రేయంతా గ‌డిపిన త‌ర్వాత త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని స‌ద‌రు స‌హాయ‌కురాలు ఆరోపిస్తూ కోర్టులో వ్యాజ్యం వేసింది. ఇటీవ‌ల స్టార్ హీరో విన్ డీసెల్ పై లాస్ ఏంజిల్స్ కోర్టులో కేసు దాఖలైంది. నిజానికి ఈ ఘ‌ట‌న జ‌రిగి చాలా కాలం అయింది. 2010 సంవ‌త్సరంలో ఫాస్ట్ ఫైవ్ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో అట్లాంటాలోని ఒక హోట‌ల్ గ‌దిలో అతడు త‌న‌పై వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని మాజీ స‌హాయ‌కురాలు జోనాస‌న్ ఆరోపించింది. తాను అరిచి గోల చేసినా విడిచిపెట్ట‌లేద‌ని అత‌డిపై ఆరోపించింది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌పై విన్ డీసెల్ లాయ‌ర్ స్పందిస్తూ.. ఇన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ ఆరోప‌ణ‌లు అసంబ‌ద్ధ‌మ‌ని కొట్టి పారేసారు. ఇలాంటి కేసు తాను ఎక్క‌డా విన‌లేద‌ని అన్నారు.

విన్ డీసెల్ సోదరి సమంతా విన్సెంట్ .. అతడి నిర్మాణ సంస్థ వన్ రేస్ మూవీస్ పైనా జోనాస‌న్ కోర్టులో దావా వేసింది. 200 మిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌ల‌తో విన్ డీసెల్ ప్ర‌పంచంలోనే గొప్ప ఆర్జ‌కుడైన స్టార్ గా కొన‌సాగుతున్నారు. అత‌డు న‌టించిన గ‌త చిత్రం ఫాస్ట్ ఎక్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. తాజా ఆరోప‌ణ‌లు విన్ డీసెల్ లాంటి ప్ర‌తిభావంతుడైన న‌టుడికి మాయ‌ని మ‌చ్చ‌గా మారాయి.