డ్రగ్స్ సేవించి నటిని వేధించిన నటుడు.. ఇంతలోనే ట్విస్టు!
ఏప్రిల్ 14న డ్రగ్స్ మత్తులో ఉన్న నటుడు టామ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని విన్సీ తన అనుభవాన్ని సినీపెద్దలకు విన్నవించింది.
By: Tupaki Desk | 17 April 2025 8:27 PM ISTమళయాళ నటి విన్సీ అలోషియస్ తన సహనటుడు షైన్ టామ్ చాకోపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. షైన్ సినిమా సెట్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఘటన సమయంలో అతడు డ్రగ్స్ ప్రభావంలో ఉన్నాడని ఆమె ఆరోపించింది. కేరళ ఫిల్మ్ ఛాంబర్ అంతర్గత కమిటీ , పర్యవేక్షణ కమిటీకి, అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA), నిర్మాతల సంఘం కార్యాలయానికి ఫిర్యాదు చేసింది.
ఏప్రిల్ 14న డ్రగ్స్ మత్తులో ఉన్న నటుడు టామ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని విన్సీ తన అనుభవాన్ని సినీపెద్దలకు విన్నవించింది. ఒకసారి నా దుస్తుల విషయంలో చిన్న చిక్కు వచ్చినప్పుడు, అతడు ముందుకు వచ్చి ''నేను చూడనా? దాన్ని సరిచేస్తాను'' అని అందరి ముందు అన్నాడని విన్సీ ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పేర్కొంది. రిహార్సల్ సమయంలో అతడు తెల్లటి పొడి పదార్థాన్ని పీల్చడం తాను చూశానని పేర్కొంది.
అయితే అదేరోజు రాత్రి కొచ్చిలోని తన హోటల్ గది నుండి నటుడు షైన్ టామ్ చాకో పారిపోతున్న సీసీ ఫుటేజ్ పోలీసులకు చిక్కినట్టు సమాచారం. ఈ సంఘటన రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. అతడు కెమెరాలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చాకో అని చెప్పుకునే వ్యక్తి హోటల్ మూడవ అంతస్తు నుండి మెట్లపైకి పరిగెత్తుతున్నట్లు సిసిటివి ఫుటేజ్‌లో కనిపించింది. నటి విన్సీ అలోషియస్ ఫిర్యాదు చేసిన తర్వాత కొచ్చి నగర పోలీసులు అతడు ఉన్న హోటల్ పై దాడి చేశారు.
314వ గది తలుపు తట్టిన అధికారులు
తన గది తలుపు శబ్ధం విని షైన్ టామ్ చాకో అధికారులను గమనించి వెంటనే హోటల్ కిటికీ గుండా దూకి పారిపోయాడు. ఎర్నాకుళం జిల్లాలోని ఒక హోటల్‌లో జిల్లా నార్కోటిక్ వ్యతిరేక స్పెషల్ యాక్షన్ ఫోర్స్ (DANSAF) చాకోను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించింది. పోలీసులు కూడా వేధింపుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. చాకో హోటల్ ప్రాంగణం నుండి పారిపోతున్న సిసిటివి ఫుటేజ్ ను పోలీసులు కనుగొన్నారు.
గతంలో నటి విన్సీ అలోషియస్ షైన్ టామ్ చాకోపై అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)కి ఫిర్యాదు చేసింది. అతను డ్రగ్స్ ప్రభావంలో ఉన్నప్పుడు అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ సంఘటన 'సూత్రవాక్యం' సినిమా షూటింగ్ సమయంలో జరిగిందని విన్సీ పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు ప్రతిస్పందిస్తూ విన్సీ అలోషియస్ ఇన్‌స్టాలో ఒక వివరణాత్మక వీడియోను షేర్ చేసిన నేపథ్యంలో ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఈ కార్యక్రమంలో తాను ఇకపై మాదకద్రవ్యాలు ఉపయోగించే నటులతో కలిసి పని చేయనని ఆమె పేర్కొంది. ఈ వీడియోలో ఒక సినిమా సెట్‌లో కలవర పెట్టిన ఘటనను విన్సీ వివరించింది. అక్కడ డ్రగ్స్ ప్రభావంలో ఉన్న టామ్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు వెల్లడించింది.
