Begin typing your search above and press return to search.

ఆ మూడు విషయాలు వినిపించాయి.. ఆడియన్స్ చేతుల్లోనే రిజల్ట్..!

విక్రాంత్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్పార్క్ లైఫ్. ఈ సినిమాలో విక్రాంత్ సరసన మెహ్రీన్, రుక్సర్ ధిల్లాన్ లు నటించారు

By:  Tupaki Desk   |   15 Nov 2023 5:46 AM GMT
ఆ మూడు విషయాలు వినిపించాయి.. ఆడియన్స్ చేతుల్లోనే రిజల్ట్..!
X

విక్రాంత్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్పార్క్ లైఫ్. ఈ సినిమాలో విక్రాంత్ సరసన మెహ్రీన్, రుక్సర్ ధిల్లాన్ లు నటించారు. హేషం అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా 17న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హరీష్ శంకర్, మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గెస్టులుగా వచ్చిన స్పార్క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కం డైరెక్టర్ విక్రాంత్ స్పీచ్ ప్రేక్షకులను మెప్పించింది.

మైక్ అందుకుని స్పీచ్ మొదలు పెట్టిన విక్రాంత్ ఇది ఒక ఎమోషనల్ జర్నీ.. ఆల్రెడీ లైఫ్ లో సెటిల్ అయ్యి రొటీన్ గా అలా ట్రావెల్ అవుతూ.. జస్ట్ సర్వైవ్ అవుతున్నా అనే ఆలోచన రాగా అప్పుడు నా డ్రీంస్ ని నెరవేర్చుకోవాలని అనుకున్నా.. కోవిడ్ అందరికీ ఒక ఐ ఓపెనర్ గా మారింది. అదే తనను సినిమా చేసేలా చేసింది. ప్రయత్నం చేయడం మాత్రమే నీ చేతిలో ఉంది ఫలితం అనేది నీ చేతిలో లేదని భగవద్గీత కృష్ణుడు చెప్పాడు. ఈ మూవీ తీయడం నా ప్రయత్నం దాని ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంది. ఫస్ట్ వారికి థాంక్స్ చెబుతున్నా. ఈవెంట్ కి వచ్చిన గెస్ట్ లకు థాంక్స్ అని అన్నారు విక్రాంత్.

ఇక ఈ సినిమా చేస్తున్న టైం లో తనకు అవదు కాదు చేయలేవు.. ఈ 3 మాటలు చాలా సార్లు విన్నా.. కథ రాసుకున్న వరకు బాగానే ఉంది. ఆ టైం లో కొందరికి చెబితే వాళ్లు మూవీ చేయడం అంత ఈజీ కాదు.. మూవీ మేకింగ్ చేయలేవు.. మొదలు పెట్టినా పూర్తి చేయలేవని అన్నారు. కానీ ఆరోజు నేను అనుకున్నా.. తల ఎగరేసి ఆన్సర్ ఇచ్చే బదులు తలదించి పనిచేద్దామని అనిపించింది. ఈ రెండిటికీ గర్వానికి అనుకువకి ఉన్న తేడా ఉంది. వర్క్ మీద శ్రద్ధ, పనిచేద్దాం, నా డ్రీం ని సాధిద్దామనుకున్నా. ఎవరేం చెప్పినా నేను నా పనిచేసుకుంటూ వెళ్లా.. ఒక మంచి సినిమా చేయాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్లా. విక్రాంత్ మంచి సినిమా తీశాడు. విక్రాంత్ మంచి యాక్టర్ అనేలా చేయాలని అనుకున్నా. చివరి వరకు నాతో నిలుచున్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు పాదాభివందనం. నా కళకి కో డైరెక్టర్ స్వామి అనుభవం జోడించారని అన్నారు విక్రాంత్.

స్పార్క్ కథ 2017 డిసెంబర్ లో మొదలు పెట్ట.. దాదాపు 6 ఏళ్లు జర్నీ.. యూఎస్ లో ఎం.ఎస్ చేసే టైం లో ఈ కథ అనుకున్నా.. కథ రాయడం ఈజీ కానీ అది చేయడం చాలా కష్టం. ఈ సినిమా పూర్తి చేసే టైం అంతా తల దించుకుని పనిచేశా.. నవంబర్ 17న ఆడియన్స్ తనని తల ఎత్తుకునేలా చేస్తారని ఆశిస్తున్నా.. నా ఏడేళ్ల కష్టానికి తగిన రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నా అని అన్నారు విక్రాంత్.

స్పార్క్ లైఫ్ లో నాయాకుడే కాదు ప్రతి నాయకుడు చాలా బాగా చేశాడు. గురు కచ్చితంగా తెలుగులో రెగ్యులర్ గా చేస్తారు. ఆకాశంలో ఉండేది ఒకటే చందమామ అయితే.. కానీ నా సినిమాలో రెండు చందమామలు ఉన్నాయి. నేను కొత్తవాడినే వారు నాకు మాస్టర్స్ లా పనిచేశారు. వాళ్ల గైడెన్స్ వల్ల ఇంకాస్త బాగా చేశా.. వెన్నెల కిశోర్, సత్య ఇద్దరు బాగా చేశారు. సుహాసిని మేడం ఈరోజుకి కూడా నమ్మలేకపోతున్నా.. స్క్రీన్ మీద ఆమెను చూస్తూ పెరిగిన నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా.. ఎదిగిన కొద్దీ ఆమె చాలా ఒదిగి ఉంటారు అని అన్నారు విక్రాంత్.

అబ్దుల్ హేషం వాహబ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చారు. లీల గారు ఎక్కడ కాంప్రమైజ్ ఆకుండా నిర్మించారు. సినిమాకు లిరిసిస్ట్ గా కాకుండా తనకు సపోర్ట్ గా ఉన్న అనంత్ శ్రీరాం కి థాంక్స్ అన్నారు విక్రాంత్.