Begin typing your search above and press return to search.

దీపికా ప‌దుకొనే పొడుగ్గా ఉంద‌ని నావ‌ల్ల కాద‌నేసా!

బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రాంత్ మెస్సీ.

By:  Tupaki Desk   |   24 July 2026 4:03 PM IST
దీపికా ప‌దుకొనే పొడుగ్గా ఉంద‌ని నావ‌ల్ల కాద‌నేసా!
X

బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రాంత్ మెస్సీ. ప్రస్తుతం విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. టెలివిజన్ రంగం నుంచి సినిమాలకు ఆపై ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వరకు ప్రతి చోటా తనదైన ముద్ర వేసిన విక్రాంత్ ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాలేదు. ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటున్నారు. తాజాగా విక్రాంత్ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన సంచలన చిత్రం `చపాక్` సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు తాను ఆ ప్రాజెక్ట్‌ను వదులుకోవాలనుకున్నట్లు విక్రాంత్ వెల్లడించారు.

దీపికా పదుకొనే లాంటి స్టార్ నటి సరసన తాను సరిపోతానో లేదోనని.. తెరపై ఇద్దరం కలిసి చూడటానికి బాగుం టామో? లేదోనని? తొలుత సందేహం వ్యక్తం చేశారు. దీపిక ఎత్తు, లుక్స్ గురించి ఆలోచించి సినిమాను రిజెక్ట్ చేద్దామని భావించినట్లు విక్రాంత్ తెలిపారు. అయితే దర్శకురాలు మేఘనా గుల్జార్ చొరవ తీసుకొని ఎలా ఒప్పించిందో కూడా విక్రాంత్ గుర్తు చేసుకున్నారు. దీపిక పెద్ద స్టార్ నాకంటే పొడవుగా ఉంటుంది. మనం జోడీగా సరిపోం అని తాను మేఘనాతో అన్నానని దానికి ఆమె బదులిస్తూ మీ ఇద్దరూ స్క్రీన్ మీద చక్కగా సరిపోతారని నచ్చజెప్పినట్లు తెలిపారు.

దర్శకురాలిపై ఉన్న నమ్మకంతోనే తాను ఆ సవాల్‌ను స్వీకరించి సినిమాలో నటించానని.. ఒకవేళ భయపడి వెనకడుగు వేసి ఉంటే అద్భుతమైన అవకాశం కోల్పోయేవాడినని పేర్కొన్నారు. కెరీర్‌లో ఊహించని ఎత్తుకు ఎదగడానికి తనపై నమ్మకం ఉంచిన దర్శకులే కారణమని విక్రాంత్ అభి ప్రాయపడ్డారు. `ఎ డెత్ ఇన్ గంజ్` చిత్రంలో తనలోని నటుడిని కొంకణా సేన్ శర్మ గుర్తించకపోతే తాను ఆ పాత్ర చేయగలిగేవాడిని కాద‌న్నారు. అలాగే విధు వినోద్ చోప్రా, మేఘనా గుల్జార్ వంటి ప్రముఖ దర్శకులు తనపై ఉంచిన నమ్మకమే మరింత మెరుగైన నటుడిగా తీర్చిదిద్దిందని కృతజ్ఞతలు తెలిపారు.

నటుడిగా ఎప్పుడూ ఒకే ఛట్రంలో ఇరుక్కుపోకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగడమే విజయ రహస్యమని విక్రాంత్ నిరూపిస్తున్నారు. తనపై తనకు సందేహాలు ఉన్నా? తోటి దర్శకుల సహకారంతో ప్రతిసారీ సరికొత్త సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్న విక్రాంత్ ప్రయాణం యువ నటులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ప్రస్తుతం విక్రాంత్ మెస్సీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అవుతున్న `ముసాఫిర్ కేఫ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. దివ్య ప్రకాష్ దూబే నవల ఆధారంగా రూపొందిన రొమాంటిక్ డ్రామాలో చాందర్ మోహన్ శర్మ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.