విరామం ఇస్తే రిటైర్మెంట్ అనుకున్నారా?
ఈ క్రమంలో విరామం తీసుకుంటున్నట్లు విక్రాంత్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. దీంతో ఆ ప్రకటన రకరకాలుగా జనాల్లోకి వెళ్లింది.
By: Tupaki Desk | 3 July 2025 4:00 AM ISTబాలీవుడ్ యంగ్ హీరోల్లో విక్రాంత్ మాస్ పుల్ స్వింగ్ లో ఉన్నాడు. కొన్నాళ్లగా విజయాలన్నీ ఇతడి చెంతే చేరుతున్నాయి. స్టార్ హీరోలే బోల్తా కొట్టినా? విక్రాంత్ మాసే సినిమాలు మాత్రం మంచి వసూళ్లను రాబడు తున్నాయి. దీంతో హీరోగానూ బాగా బిజీ అయ్యాడు. గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షుకుల ముందుకొచ్చాడు. 2025 లో మరో మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమాలు డిలే అవుతున్నాయి. ఈ క్రమంలో కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు.
ఈ క్రమంలో విరామం తీసుకుంటున్నట్లు విక్రాంత్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. దీంతో ఆ ప్రకటన రకరకాలుగా జనాల్లోకి వెళ్లింది. విక్రాంత్ సినిమాల నుంచి రిటైర్ అయ్యాడని...విదేశాల్లో స్థిరపడే ఆలో చనతో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని విక్రాంత్ ఖండించాడు. తాను సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోలేదని , తాను పెట్టిన పోస్టును తప్పుగా అర్దం చేసుకునే ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్ని క్లారిటీ ఇచ్చాడు.
అభిమానులకు తాను విరామం తీసుకోవడం ఇష్టంలేకపోయినా తనను తెరపై కొత్తగా చూడాలంటే మౌల్డ్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని...ఈ విరామం అన్నది అత్య అవసరంగా భావించాడు. `ది సబర్మతి రిపోర్ట్` తర్వాత చాలా కథలు విన్నానని, కానీ అవేవి నచ్చకపోవడంతో కమిట్ అవ్వలేదన్నాడు. ప్రస్తుతం విక్రాంత్ లైనప్ లో `అంకూన్ కీ గుస్తా కియాన్ `అర్జున్ ఉత్సారా`, `యార్ జాగిర్` , `తల్లాకూన్ మెయిన్ ఏక్` చిత్రాలు న్నాయి.
`అర్జున్ ఉత్సారా` ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగతా రెండు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే ఈ చిత్రాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్నది మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. `అంకూ న్ కీ గుస్తా కియాన్ మాత్రం జూలైలో రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని సంతోష్ సింగ్ తెరకె క్కించాడు. ఇందులో విక్రాంత్ కు జోడీగా శానయ్య కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
