Begin typing your search above and press return to search.

అక్కడ ఉంది కబాలి.. విక్రం కష్టం వృధా కాదంతే..!

కోలీవుడ్ విలక్షణ నటుల్లో ఒకరైన విక్రం కొన్నాళ్లుగా ఏమాత్రం ఫాం లో లేరన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 April 2024 1:46 PM GMT
అక్కడ ఉంది కబాలి.. విక్రం కష్టం వృధా కాదంతే..!
X

కోలీవుడ్ విలక్షణ నటుల్లో ఒకరైన విక్రం కొన్నాళ్లుగా ఏమాత్రం ఫాం లో లేరన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు తన సినిమాలతో సౌత్ మొత్తం సెన్సేషనల్ హిట్ అందుకున్న విక్రం ఇప్పుడు సొంతం భాష తమిళంలో కూడా సక్సెస్ అందుకోవట్లేదు. విక్రం సినిమాలు సక్సెస్ అందుకోకపోవడానికి మెయిన్ రీజన్ సినిమాలు అనుకున్న డేట్ కి రాకపోవడమే.. ఈమధ్య విక్రం సినిమాలు ఎందుకో అనుకున్న టైం కు రాలేకపోతున్నాయి. సినిమా రిలీజ్ టైం కు ఏదో ఒక సమస్య రావడం వాయిదా పడటం జరుగుతూనే ఉంది.

విక్రం ఫ్యాన్స్ కూడా ఆయన సినిమాల రిలీజ్ విషయంలో జరుగుతున్న ఈ వాయిదాల వల్ల విసిగిపోయారు. అయితే తిరిగి ఫాంలోకి వచ్చేందుకు చియాన్ విక్రం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం విక్రం చేస్తున్న సినిమా తంగళాన్. ఈ సినిమాను కబాలి పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. తంగళాన్ సినిమాపై చియాన్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకోగా ఈ సినిమా వాయిదాలు మళ్లీ వారిని నిరాశపరుస్తున్నాయి.

అయితే రీసెంట్ గా చియాన్ విక్రం బర్త్ డే సందర్భంగా వదిలిన వీడియో చూసి చియాన్ ఫ్యాన్స్ కు ఊపొచ్చింది. తంగళాన్ సినిమాలో విక్రం తన పాత్ర కోసం ఎంత కష్టపడి మేకప్ వేసుకున్నాడు. ఈ మేకోవర్ కోసం ఎంత కష్టపడ్డాడు అన్నది చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు విక్రం ఇలాంటి మేకోవర్స్ అన్ని సినిమాల్లో చేస్తాడు కానీ అక్కడ ఉంది కబాలి రంజిత్ కాబట్టి అతన్ని తక్కువ అంచనా వేయలేం. సో తప్పకుండా క్యారెక్టర్ లుక్కే కాదు కథలో బలం కూడా అదే రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నారు.

విక్రం హిట్టు కొడితే చూడాలని చియాన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సినీ ప్రేక్షకుడు కూడా కోరుతున్నాడు. తంగళాన్ మీద పా రంజిత్ భారీ హోప్స్ పెట్టుకున్నాడు. కచ్చితంగా సినిమా చియాన్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. విక్రం తంగళాన్ తో తిరిగి ఫాం లోకి వస్తాడా.. చియాన్ సత్తా ఏంటో బాక్సాఫీస్ లెక్కలపై తెలుస్తుందా అన్నది తంగళాన్ వస్తేనే కానీ చెప్పగలం. ఈ సినిమా ప్రచార చిత్రాలు మాత్రం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాయి.