ఆ టైమ్ లో ఏం చేయాలో తెలియలేదు
హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ లో రియా శింబు నిర్మించిన ఈ మూవీలో దుషార విజయన్ హీరోయిన్ గా నటించింది.
By: Tupaki Desk | 4 April 2025 7:00 PM ISTతమిళ స్టార్ హీరో విక్రమ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ ఆ సినిమాలు ఏదొక సమస్యతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ విక్రమ్ మార్కెట్ ను దెబ్బతీస్తున్నాయి. రీసెంట్ గా విక్రమ్ వీర ధీర శూరన్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ లో రియా శింబు నిర్మించిన ఈ మూవీలో దుషార విజయన్ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు ముందు లీగల్ సమస్యలను ఎదుర్కొన్న ఈ సినిమా ఏకంగా నాలుగు వారాల పాటూ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి సినిమా రిలీజయ్యాక మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తూ సినిమా ఘన విజయం సాధించింది.
వీర ధీర శూరన్ 2 సక్సెస్ అవడంపై విక్రమ్ తన ఆనందాన్ని తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో విక్రమ్ మాట్లాడుతూ, వీర ధీర శూరన్ తమకెంతో స్పెషల్ మూవీ అని, సినిమాకు మంచి రిజల్ట్ వచ్చేలా చేసిన ఆడియన్స్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. రిలీజ్ కు ముందు సినిమాను చాలా మందికి చూపించామని, సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఈ ఇయర్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఇది నిలుస్తుందన్నారని దాంతో ఎంతో సంతోషించామని విక్రమ్ చెప్పారు.
అందరూ చెప్పిన మాటలతో సినిమాపై తమకు మరింత నమ్మకం ఏర్పడిందని, కానీ తీరా రిలీజ్ కు ముందు తమ సినిమాకు లీగల్ ఇష్యూస్ ఎదురయ్యాయని, నాలుగు వారాల పాటూ సినిమాను వాయిదా వేయాలని హైకోర్టు ఆర్డర్ వేయడం వల్ల రిలీజ్ రోజు చాలా షో లు క్యాన్సిల్ అయ్యాయని, ఆ విషయం తనను ఎంతగానో బాధించిందని, ఆ టైమ్ లో ఏం చేయాలో కూడా అర్థం కాలేదని విక్రమ్ అన్నారు.
ఎలాగైనా సినిమాను బయటకు తీసుకొచ్చి ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేయాలని ఎంతో కష్టపడి సినిమాను రిలీజ్ చేశామని, ఈవెనింగ్ షో ల నుంచి సినిమా ఆడియన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చిందని, అప్పట్నుంచి ఆడియన్స్ సినిమాపై ప్రేమ కురిపిస్తున్నారని దానికి తనకెంతో ఆనందంగా ఉందని చెప్తూ విక్రమ్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
వీర ధీర శూరన్ లీగల్ సమస్యలు ఎదుర్కోవడానికి కారణం ఓటీటీ డీల్. సినిమా రిలీజ్ కంటే ముందే రైట్స్ అమ్ముతామని నిర్మాతలు తమకు మాటిచ్చినప్పటికీ ఆ మాటను పక్కన పెట్టారని బి4యు సంస్థ డిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో నిర్మాతలు ఆ సంస్థకు రూ.7 కోట్లు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే విక్రమ్ తన రెమ్యూనరేషన్ ను కూడా తగ్గించుకున్నారని వార్తలొచ్చాయి.
