దర్శకుడు అవ్వాలనుకున్న నటుడీయన!
తాజాగా కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు కూడా ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలని వచ్చినట్లు తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రివీల్ చేసాడు.
By: Tupaki Desk | 1 Sept 2025 12:00 AM ISTడాక్టర్లు అవ్వాలనుకున్న వాళ్లు యాక్టర్లు అవుతారు. యాక్టర్లు అవ్వాలనుకున్న వాళ్లు డాక్టర్లు అవు తుంటారు. ఇది ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే మాట. ఇండస్ట్రీకి వచ్చేవారికి ఒక్కో డ్రీమ్ ఉంటుంది. హీరో అవ్వా లని..డైరెక్టర్ వ్వాలని..కమెడియన్ అవ్వాలని..డాన్సర్ అవ్వాలని..రైటర్ అవ్వాలని ఇలా రకరకాల ఆశలతో ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తారు. కానీ వారు అనుకున్నది ఇక్కడ జరగదు. పరిస్థితులను బట్టి స్థానాలు మారిపోతుంటాయి. డైరెక్టర్ అవ్వాలనుకున్న నాని హీరో అయినట్లు. నటుడు అవ్వాల నుకున్న వాళ్లు రైటర్ అయినట్లు.
ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు కూడా ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలని వచ్చినట్లు తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రివీల్ చేసాడు. తన జీవితం లో ఏదీ ప్రణాళికబద్దంగా జరగలేదున్నారు. నటుడైన తర్వాత మనసు ఏం చెబితే అది చేయడం అలవా టుగా చేసుకున్నట్లు తెలిపారు. అనుకున్నవన్నీ జరిగిపోతే జీవితం ఎలా అవుతుంది? అందుకే ప్లానింగ్ లు మానేసి అప్పటికప్పుడు ఏది అనిపిస్తే? అది చేస్తున్నా. ఇలా చేయడం చాలా కంపర్ట్ గా ఉంది. టెన్షన్ పడాల్సిన పని లేదన్నారు.
అలాగే `రుద్రమదేవి` చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రకు తొలుత తననే దర్శకుడు సంప్రదించారని కానీ ఆ సమయంలో బిజీగా ఉండటం వల్ల వచ్చిన అవకాశం వదులుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ పాత్రలో నటించిన బన్నీ వందశాతం న్యాయం చేసారన్నారు. ప్రస్తుతం అనుష్క తో చేసిన `ఘాటీ` ఎంతో సంతోషా న్నిచ్చిందన్నారు. గతంలో అనుష్క తో నటించే అవకాశం వచ్చినా? అప్పుడు వీలు పడక నటించలే దన్నారు. రెండవ సారి ఛాన్స్ వస్తే వదులుకోకూడదని ఆనాడే డిసైడ్ అయినట్లు తెలిపారు.
విక్రమ్ ప్రభు `కుంకీ` చిత్రంతో కోలీవుడ్ కి నటుడిగా పరిచయమయ్యాడు. తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాతో నటుడిగా మంచి పేరొచ్చింది. అటుపై హీరోగా కొన్ని సినిమాలు చేసారు. అలాగే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రయాణం రెండు రకాలుగానూ ముందుకు తీసుకెళ్తున్నారు. `ఘాటీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటీపై మంచి అంచనాలున్నాయి.
