కమల్ పొన్నియిన్‌కి విక్రమ్ నో ఎందుకు చెప్పాడు..?
పొన్నియన్ సెల్వన్‌ను సినిమాగా తీసుకు రాలేక పోయిన కమల్ హాసన్ టీవీ సిరీస్‌గా తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు.
By: Tupaki Desk | 18 April 2025 5:00 AM ISTతమిళ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'పొన్నియన్ సెల్వన్' సినిమా 2022లో మొదటి పార్ట్, 2023లో రెండో పార్ట్ వచ్చిన విషయం తెల్సిందే. తమిళనాట రెండు పార్ట్‌లకు మంచి స్పందన దక్కింది. తమిళనాట అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో పొన్నియన్ సెల్వన్ నిలిచింది. ఆ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మీ, కార్తీ ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు నటించిన విషయం తెల్సిందే. విక్రమ్ రెండు పార్ట్‌ల్లోనూ కీలక పాత్రలో కనిపించాడు. ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటించి మెప్పించాడు. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో విక్రమ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం తెల్సిందే.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాను చేయడం తన అదృష్టం అంటూ విక్రమ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే అదే పొన్నియన్ సెల్వన్ ప్రాజెక్ట్‌లో దాదాపు మూడు దశాబ్దాల క్రితం నటించే అవకాశం దక్కింది. కానీ ఆ సమయంలో విక్రమ్ నో చెప్పాడట. ఇటీవల తన బర్త్‌డే సందర్భంగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొన్నియన్ సెల్వన్ నవల రైట్స్‌ను 1980ల్లో కమల్ హాసన్ తీసుకున్నారు. ఆ సమయంలో రజనీకాంత్‌తో పాటు సత్యరాజ్, ప్రభులతో సినిమాను రూపొందించాలని అనుకున్నాడు. కానీ ఆ సమయంలో ప్రాజెక్ట్ సినిమాగా కార్యరూపం దాల్చలేదు.
పొన్నియన్ సెల్వన్‌ను సినిమాగా తీసుకు రాలేక పోయిన కమల్ హాసన్ టీవీ సిరీస్‌గా తీసుకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో విక్రమ్‌ను సంప్రదించాడట. కానీ విక్రమ్ నో చెప్పాడట. సినిమాల్లో నటిస్తున్న విక్రమ్ ఆ సమయంలో టీవీ సిరీస్‌లో నటించేందుకు నో చెప్పాడట. టీవీ సిరీస్ ప్రపోజల్‌ను విక్రమ్ ముందు ఉంచిన కమల్ హాసన్ నీకు ఇష్టం వచ్చిన పాత్రను ఎంపిక చేసుకోమంటూ ఆఫర్ ఇచ్చాడట. ఒక రోజు తర్వాత కమల్ వద్దకు వెళ్లి ఈ ప్రాజెక్ట్‌లో నటించాలని అనుకుంటున్నాను. కానీ అది సినిమాగా వచ్చినప్పుడు మాత్రమే నటిస్తాను అంటూ సున్నితంగా కమల్ హాసన్ ఆఫర్‌ను తిరస్కరించాడట.
పొన్నియన్ సెల్వన్‌లోని కరికాల పాత్ర మూడు దశాబ్దాల తర్వాత తిరిగి విక్రమ్ చెంతకు వచ్చింది. ఆ పాత్రను విక్రమ్ చేయాలని ఉండటం వల్లే ఆ సమయంలో సినిమా, ఆ తర్వాత టీవీ సిరీస్‌గా రాలేదు. ఇప్పుడు సినిమా రూపంలో వచ్చి, అందులో విక్రమ్‌కి ఆఫర్ దక్కింది. పొన్నియన్ సెల్వన్ గురించి ఎప్పుడు అనుకున్నా ఆ సమయంలో విక్రమ్ ను పరిగణలోకి తీసుకోవడం జరిగిందట. అది తన అదృష్టం అని విక్రమ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈమధ్య కాలంలో పొన్నియన్ సెల్వన్ తప్ప మరో విజయాన్ని విక్రమ్ సొంతం చేసుకోలేక పోయాడు. అయినా కూడా విక్రమ్ కి కోలీవుడ్‌లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన గొప్ప నటుడు అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.
