జక్కన్న - మహేష్ ప్రాజెక్ట్ కోసం క్రేజీ స్టార్?
RRR వంటి సంచలన బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 16 May 2025 11:45 AM ISTRRR వంటి సంచలన బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.ఎల్. నారాయణ ఈ భారీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో సాగే కథతో యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.
హాలీవుడ్ టెక్నీషియన్‌లు వర్క్ చేస్తున్న ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్, విజయేంద్ర ప్రసాద్ కథ, పీఎస్ వినోద్ ఫొటోగ్రఫీ, కమల్ కణ్ణన్ వీఎఫ్ ఎక్స్ అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన జక్కన్న ప్రస్తుతం సెక్ండ్ షెడ్యూల్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు. గత చిత్రాలని స్లోగా పూర్తి చేసి ఏళ్లకు ఏళ్లు టైమ్ తీసుకున్న రాజమౌళి ఎందుకో ఈ మూవీ కోసం మాత్రం పరుగులు పెడుతూ చక చకా షూటింగ్‌ని పూర్తి చేస్తున్నాడు.
అంతే కాకుండా ఈ మూవీ కోసం ఎవరూ ఊహించని స్టార్స్‌ని రంగంలోకి దించేస్తూ అంచనాల్ని పెంచేస్తున్నాడు. ఇప్పటికే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార్‌ని రంగంలోకి దించేసిన జక్కన్న ఇదే తరహాలో మరో కీలక పాత్ర కోసం క్రేజీ స్టార్‌ని దించేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. `SSMB29` అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం తమిళ స్టార్ విక్రమ్‌ని తీసుకొస్తున్నారట. ఇప్పటికే విక్రమ్‌తో జక్కన్న చర్చలు పూర్తి చేశారని, త్వరలోనే అధికారికంగా ఓ ప్రకటన చేయబోతున్నారని ఇన్ సైడ్ టాక్.
ఈ ప్రాజెక్ట్‌లో పృథ్వరాజ్ సుకుమారన్ నటిస్తారంటూ ఆ మధ్య వార్తలు షికారు చేయడం, అవి నిజం కావడం తెలిసిందే. అదే స్థాయిలో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో విక్రమ్ కీలక పాత్రలో నటించనున్నాడని వార్తలు మొదలయ్యాయి. ఇవి కూడా త్వరలో నిజం కానున్నాయని తెలుస్తోంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగబోతోంది. ఇందు కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీ సెట్‌ని సిద్ధం చేస్తున్నారట. ఈ సెట్‌లో హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో భారీ యాక్షన్ ఘట్టాలని షూట్ చేయబోతున్నారట. ఇందులోనే హీరో విక్రమ్ పాల్గొంటారని తెలిసింది. గతంలో విక్రమ్ ఈ ప్రాజెక్ట్ గురించి స్పందిస్తూ రాజమౌళితో తాను రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నామని చెప్పిన విషయం తెలిసిందే.
