Begin typing your search above and press return to search.

ఖుషితో.. హిట్ కొట్టే తీరాలి..

లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ చేస్తోన్న ఖుషి మూవీతో అతనికి సాలిడ్ హిట్ కావాలి.

By:  Tupaki Desk   |   29 Aug 2023 4:18 AM GMT
ఖుషితో.. హిట్ కొట్టే తీరాలి..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత జోడీగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా కథ ఉండబోతోందని ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది.

ప్రస్తుతానికి అయితే సినిమాపై పాజిటివ్ బజ్ నడుస్తోంది. కచ్చితంగా విజయ్ దేవరకొండ కెరియర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ఈ చిత్రానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో ఖుషి సందడి మొదలవ్వనుంది. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ చేస్తోన్న ఖుషి మూవీతో అతనికి సాలిడ్ హిట్ కావాలి.

అలాగే శాకుంతలం లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత సమంతకి ఖుషినే హాప్ గా ఉంది. టక్ జగదీశ్ లాంటి ఫ్లాప్ తర్వాత శివ నిర్వాణ కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఖుషి బెస్ట్ ఛాయస్ గా ఉంది. ఇలా వీరందరికి ఖుషి మూవీ హిట్ ఎంత అవసరమో టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా అంతే అవసరం అని చెప్పాలి. బేబీ తర్వాత టాలీవుడ్ లో ఇప్పటి వరకు సాలిడ్ హిట్ పడలేదు.

గత రెండు నెలల కాలంలో తెలుగులో రిలీజ్ అయిన సినిమాలలో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రేక్షకులని మెప్పించింది అంటే బేబీ మాత్రమే అని చెప్పాలి. తరువాత చాలా మూవీస్ వచ్చిన మేగ్జిమమ్ అన్ని డిజాస్టర్ అయ్యాయి. బెదురులంక 2012 మూవీ కొంత వరకు పర్వాలేదని టాక్ తెచ్చుకున్న బ్లాక్ బస్టర్ కష్టం. సూపర్ స్టార్ రజినీకాంత్ డబ్బింగ్ మూవీ జైలర్ మాత్రం టాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసింది.

మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఖుషి సినిమాతో సాలిడ్ హిట్ కావాలి. మరి ఈ చిత్రం ఏ మేరకు టాలీవుడ్ లో ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి రీచ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాదిలో మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో రెండు హిట్స్ పడ్డాయి. ఖుషి కూడా హిట్ అయితే హ్యాట్రిక్ పడినట్లు అవుతుంది.