Begin typing your search above and press return to search.

దేవరకొండకు మరో అర్జున్ రెడ్డి పడాల్సిందే..!

సరైన ఛాన్స్ రావడం కాదు వచ్చిన ఆ అవకాశాన్ని ఎలా వాడుకున్నాం అన్నది ముఖ్యం.

By:  Tupaki Desk   |   17 April 2024 1:30 PM GMT
దేవరకొండకు మరో అర్జున్ రెడ్డి పడాల్సిందే..!
X

తెలుగు యువ హీరోల్లో స్వతహాగా ఎదిగిన వారే ఎక్కువమంది ఉన్నారు. ఎలాగైనా ఆడియన్స్ తో శభాష్ అనిపించుకోవాలి.. స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలనే సంకల్పంతో చిన్న చితకా ఛాన్సులతో కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు వారికంటూ ఒక సెపరేట్ క్రేజ్ వచ్చేలా చేసుకున్నారు. అలాంటి వారిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో గుర్తింపు ఉన్న పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ అంతకుముందు శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో తళుక్కున మెరిశాడు. పెళ్లిచూపులు సినిమాతో తన తొలి ప్రయత్నంతోనే సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో తన స్టామినా చూపించాడు.

సరైన ఛాన్స్ రావడం కాదు వచ్చిన ఆ అవకాశాన్ని ఎలా వాడుకున్నాం అన్నది ముఖ్యం. అర్జున్ రెడ్డి సినిమా చూశాక స్టార్ హీరోలంతా కూడా విజయ్ నటన గురించి మాట్లాడుకునేలా చేశాడు. సందీప్ వంగ రాసుకున్న ఆ పాత్రకు విజయ్ చేసిన యాక్టింగ్ అతన్ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. ఆ తర్వాత గీతా గోవిందం తో సూపర్ హిట్ అందుకున్న విజయ్ టాలీవుడ్ లో నవతరం స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత టాక్సీవాలా సినిమాతో కూడా సక్సెస్ అందుకున్నాడు విజయ్.

అయితే డియర్ కామ్రేడ్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ వరకు విజయ్ తన రేంజ్ సక్సెస్ అందుకోలేదు. మధ్యలో ఖుషి సినిమా జస్ట్ ఓకే అనిపించింది కానీ విజయ్ మార్క్ సాలిడ్ హిట్ అందుకోలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరితో ఒక సినిమా చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాతో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ కు మరో అర్జున్ రెడ్డి లాంటి సినిమా పడాల్సిందే. అలాంటి సినిమా పడితే మళ్లీ తన సత్తా ఏంటన్నది తెలుస్తుంది.

డైరెక్టర్స్ కొత్త పాత్ర రాయాలే కానీ అందులో పరకాయ ప్రవేశం చేసేందుకు తాను రెడీ అంటున్నాడు విజయ్ దేవరకొండ. అయితే తను ఈమధ్య చేస్తున్న సినిమాల్లో పాత్రలన్నీ రొటీన్, రెగ్యులర్ గా అనిపిస్తున్నాయి. విజయ్ స్పెషాలిటీ తెలిపే ఛాన్స్ వస్తే మాత్రం ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే లెక్క. రౌడీ హీరో స్టామినా తెలిసినా ఈమధ్య ఎందుకో అతని మార్క్ సినిమాలు పడక వెనకబడి ఉన్నాడు. మరి గౌతం తిన్ననూరి సినిమాతో అయినా దేవరకొండ హీరో బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అన్నది చూడాలి. విజయ్ కెరీర్ లో మరో స్ట్రాంగ్ హిట్ పడితే కానీ అతని మీద నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి సమాధానం దొరికినట్టు అవుతుంది.