Begin typing your search above and press return to search.

విజ‌య్ Vs త‌మ‌న్నా: సినిమావాళ్లు వ‌ద్ద‌నుకున్నాను కానీ..!

సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టి లేదా అమ్మాయితో డేటింగ్ చేయకూడదని భావించాను. ఎందుకంటే నేను వారిపై చాలా కోపంగా ఉన్నాను.

By:  Tupaki Desk   |   28 Aug 2023 3:22 PM GMT
విజ‌య్ Vs త‌మ‌న్నా: సినిమావాళ్లు వ‌ద్ద‌నుకున్నాను కానీ..!
X

కొంత‌కాలంగా త‌మ‌న్నా భాటియా-విజ‌య్ వ‌ర్మ డేటింగ్ గురించి స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ జంట ఫోటోలు, ఘాటైన రొమాన్స్ వీడియోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ముచ్చ‌టైన జోడీ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్కుతుందంటూ ప్ర‌చారం సాగుతోంది. ఇక ఆ ఇద్ద‌రూ డేటింగ్ వ్య‌వ‌హారాన్ని అధికారికం చేయ‌డంతో ఫ్యాన్స్ లో ఎగ్జ‌యిట్ మెంట్ త‌గ్గ‌డం లేదు.

తాజాగా విజ‌య్ వ‌ర్మ త‌న డేటింగ్ రూల్ ని బ్రేక్ చేసాన‌ని బ‌హిరంగంగా చెప్పాడు. గర్ల్ ఫ్రెండ్ తమన్నా భాటియా కోసం విజయ్ వర్మ తన డేటింగ్ నిబంధనలను ఉల్లంఘించాన‌న్నాడు. లస్ట్ స్టోరీస్ 2 స‌మ‌యం నుంచి తమన్నా భాటియా - విజయ్ వర్మల స్నేహం మొద‌లైంది. క్ర‌మంగా ఈ స్నేహం ప్రేమ‌గా మారింది. ఇప్పుడు తన స్నేహితురాలు తమన్నాతో ప్రేమాయ‌ణాన్ని ప్రారంభించడానికి తన డేటింగ్ నియమాలలో ఒకదాన్ని బ్రేక్ చేసాన‌ని అత‌డు అంగీకరించాడు.

పాపుల‌ర్ జ‌ర్న‌లిస్ట్ అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజ‌య్ వినోద ప్రపంచంలోకి కొత్తగా వచ్చినప్పుడు సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టి లేదా అమ్మాయితో డేటింగ్ చేయకూడదని భావించాను. ఎందుకంటే నేను వారిపై చాలా కోపంగా ఉన్నాను.. అని అన్నాడు. కానీ ఇంత‌లోనే విజయ్ వర్మ తన జీవితంలో తమన్నా భాటియాతో చెలిమి చేశాడు. అది తన దృక్పథాన్ని ఎలా మార్చేసిందో ఇప్పుడిలా ఓపెన‌య్యాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్ట‌ప‌డుతున్న క్ర‌మంలో త‌మ‌న్నాలో ప‌రిణ‌తి తెలివితేటలు అన్నివిధాలా ఆక‌ర్షించాయ‌ని విజ‌య్ తెలిపాడు. త‌న‌ను చూసిన‌ త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్నాడు. డేటింగ్ నియమాల్ని ఉల్లంఘించాడు. అన్నివిధాలా అవ‌గాహ‌న ఉన్న వాళ్లు త‌న జీవితంలోకి వ‌స్తే అదే చాల‌ని అనుకున్న‌ట్టు తెలిపాడు. తమన్నా భాటియా మంచి వృత్తి నిపుణురాలు.. మంచి స్వ‌భావం.. గొప్ప అనుభ‌వం తెలివితేట‌లు ఉన్న న‌టి అని విజ‌య్ ప్రశంసించారు. త‌మ‌న్నా న‌డ‌వ‌డిక ధోర‌ణి త‌న‌కు ఇష్ట‌మ‌ని విజ‌య్ వ‌ర్మ అన్నారు. చాలా విషయాలపై లోతైన‌ దృక్పథం ఉన్న న‌టి అని పొగిడేశాడు.

జ‌ర్న‌లిస్ట్ అనుప‌మ్ తో గ‌త‌ ఇంటర్వ్యూలో విజ‌య్ వ‌ర్మ‌తో తన ప్రేమాయ‌ణాన్ని త‌మ‌న్నా అధికారికంగా ధృవీకరించింది. ల‌స్ట్ స్టోరీస్ స‌మ‌యం నుంచి విజ‌య్ తో స‌న్నిహితంగా ఉన్నాన‌ని త‌న‌కు అత‌డు ర‌క్ష‌ణ‌గా ఉన్నాడ‌ని త‌మ‌న్నా తెలిపింది. అతడు (విజ‌య్) నా విష‌యంలో చాలా శ్రద్ధ చూపే వ్యక్తి. అతడు నా హ్యాపీ ప్లేస్ అని కూడా త‌మ‌న్నా త‌న మ‌న‌సును బ‌హిర్గ‌తం చేసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సౌరవ్ డే-ఆఖ్రీ సచ్ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు అందుకుంది. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో జరిగిన విషాదం నేప‌థ్యంలో చిత్ర‌మిది. అనేక ఆత్మహత్యలకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన క‌థాంశంతో ఇది రూపొందింది. ఆగస్టు 25న ప్రీమియర్ అయిన డిస్నీ+ హాట్‌స్టార్ సిరీస్ అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంటోంది. జైలర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో రజనీకాంత్ స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టించింది. భోళా శంకర్‌లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి కనిపించింది. విజయ్ వర్మ తదుపరి సుజోయ్ ఘోష్ - జానే జాన్‌లో నటించనున్నారు. అతడు చివరిగా ప్రైమ్ వీడియో సిరీస్ -దహాద్ .. సస్పెన్స్-క్రైమ్ డ్రామా కాల్‌కూట్‌లో కనిపించాడు.