Begin typing your search above and press return to search.

బాబోయ్‌ ఈ అవతారం ఏంటన్నా...!

సూపర్ స్టార్‌ విజయ్ ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో 'గోట్‌' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   22 March 2024 5:22 AM GMT
బాబోయ్‌ ఈ అవతారం ఏంటన్నా...!
X

సూపర్ స్టార్‌ విజయ్ ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో 'గోట్‌' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం తిరువనంతపురం కి విజయ్ వెళ్లాడు. అక్కడ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు విజయ్‌ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

తిరువనంతపురం షూటింగ్ కు వెళ్లిన విజయ్ లుక్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పెద్ద జుట్టు మరియు మీసాలు మరియు గడ్డం లేకుండా కనిపించాడు. చాలా మంది ఈ లుక్ చూసి షాక్ అవుతున్నారు. నెటిజన్స్ ఈ లుక్ పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

స్వయంగా విజయ్ అభిమానులు కూడా బాబోయ్‌ ఏంటన్న ఈ లుక్ అన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి లుక్ ను నీ నుంచి ఆశించలేదు అంటూ వారు సోషల్‌ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో దర్శకుడు వెంకట్‌ ప్రభు పై వారు విమర్శలు చేస్తున్నారు.

విజయ్ నేచురల్‌ లుక్ ను చెడగొట్టి ఇలా దరిద్రంగా మార్చావు. ఈ సినిమాను జనాలు కాదు కనీసం ఫ్యాన్స్ అందరూ అయినా చూసే పరిస్థితి ఉంటుందా అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. గోట్‌ సినిమాలో విజయ్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో దర్శకుడు వెంకట్‌ ప్రభు చూపించబోతున్నాడు.

రెండు పాత్రల్లో ఒక పాత్ర ముసలి వయసులో ఉన్న విజయ్‌. ఆ పాత్ర కోసం ఇలా లుక్ ను విజయ్ మార్చి ఉంటాడు అనేది తమిళ మీడియా వర్గాల్లో టాక్‌. రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ప్రకటించిన విజయ్‌ చివరగా చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అలాంటి సినిమాకు ఇలాంటి లుక్ ఏంటో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.