Begin typing your search above and press return to search.

జైలర్ రికార్డులకు ఎసరు పెట్టిన లియో

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం లియో.

By:  Tupaki Desk   |   22 Oct 2023 10:03 AM IST
జైలర్ రికార్డులకు ఎసరు పెట్టిన లియో
X

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం లియో. ఈ సినిమాకి మొదటి రోజు మిక్సడ్ టాక్ వచ్చింది. దీంతో ఫస్ట్ డే వచ్చిన స్థాయిలో సెకండ్ డే కలెక్షన్స్ లేవని చెప్పాలి. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకి పైగా గ్రాస్ ని లియో వసూళ్లు చేసింది. తెలుగు రాష్ట్రాలలో కూడా 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇదేమీ చిన్న విషయం కాదు. అలాగే కర్ణాటకలో 13 కోట్ల గ్రాస్ ని లియో సినిమా కలెక్ట్ చేసింది. విజయ్ ఇమేజ్ పరంగా చూసుకుంటే తెలుగు, కన్నడ భాషలలో అతని కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. అయితే ఎవరేజ్ టాక్ కారణంగా ఈ సినిమా రెండు రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. తెలుగులో సెకండ్ డే కేవలం 5 కోట్ల గ్రాస్ మాత్రమే అందుకుంది.

కన్నడంలో 4 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. జైలర్ మూవీ కలెక్షన్స్ మాత్రం మొదటి రోజు కంటే రెండో రోజు అధికంగా వచ్చాయి. ఓవరాల్ గా తెలుగులో జైలర్ చిత్రం 86 కోట్లు కలెక్ట్ చేసింది. కన్నడంలో జైలర్ 71 కోట్లని కొల్లగొట్టింది. ఈ ప్రభావం ఓవరాల్ గా మూవీ కలెక్షన్స్ పై ప్రభావం చూపించాయి.

అయితే లియో చిత్రం మాత్రం కలెక్షన్స్ పరంగా తెలుగు, కన్నడ భాషలలో పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే తమిళంతో పాటు ఓవర్సీస్ లో లియో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ వీకెండ్ వరకు కలెక్షన్స్ భారీగానే ఉండే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో ఎంత ప్రభావం చూపిస్తుంది అనేదానిని బట్టి జైలర్ కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది.

తెలుగులో అయితే భగవంత్ కేసరి చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో లియో మూవీపై ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. అలాగే కన్నడంలో శివరాజ్ కుమార్ ఘోస్ట్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో అక్కడ కూడా లియో కలెక్షన్స్ కి భారీగా గండి పడే ఛాన్స్ ఛాన్స్ కనిపిస్తోంది.