Begin typing your search above and press return to search.

విక్రమ్ రేంజ్ లో లియో ఉంటుందా..?

కమల్ హాసన్ విక్రం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ ఒక్కసారిగా సౌత్ స్టార్ డైరెక్టర్ గా తన టాలెంట్ చూపించాడు. ఖైదీ, మాస్టర్ సినిమాలతో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన లోకేష్ విక్రం తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాడు. ఇక ఆ డైరెక్టర్ నెక్స్ట్ విజయ్ తో లియో సినిమా చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   30 July 2023 6:58 AM GMT
విక్రమ్ రేంజ్ లో లియో ఉంటుందా..?
X

కమల్ హాసన్ విక్రం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ ఒక్కసారిగా సౌత్ స్టార్ డైరెక్టర్ గా తన టాలెంట్ చూపించాడు. ఖైదీ, మాస్టర్ సినిమాలతో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన లోకేష్ విక్రం తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాడు. ఇక ఆ డైరెక్టర్ నెక్స్ట్ విజయ్ తో లియో సినిమా చేస్తున్నాడు. విజయ్ హీరోగా వస్తున్న లియో సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.

లియో సినిమా లోకేష్ విక్రం స్టైల్ లో ఉంటుందా లేదా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే విజయ్ తో లోకేష్ తీసిన మాస్టర్ తమిళ్ లో సూపర్ హిట్ అయినా తెలుగులో యావరేజ్ గానే నిలిచింది. కానీ విక్రం మాత్రం తెలుగులో కూడా సెన్సేషనల్ హిట్ అందుకుంది. అయితే ప్రస్తుతం లియో చేస్తున్న లోకేష్ విక్రం లా హిట్ కొడతాడా మాస్టర్ తరహాలో పాస్ మార్కులు సంపాదిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

విక్రమ్ సినిమాతో లోకేష్ డైరెక్షన్ పవర్ సౌత్ ఆడియన్స్ అందరికి బాగా ఎక్కేసింది. ఆ సినిమా డైరెక్టర్ గా సినీ లవర్స్ అందరినీ ఆకట్టుకున్నాడు లోకేష్. అలాంటి వారందరు లియో మీద భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. లియో ఆ కాలిక్యులేషన్స్ కి ఏమాత్రం తగ్గినా ఫ్యాన్స్ నిరాశ పడతారు. లోకేష్ కనగరాజ్ విజయ్ ఇద్దరు కలిసి వెండితెర మీద మ్యాజిక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

విజయ్ సినిమాలు తెలుగులో మంచి మార్కెట్ సంపాదిస్తున్నాయి. లియోకి కచ్చితంగా తెలుగులో కూడా బిజినెస్ బాగానే జరిగేలా ఉంది. లియో వర్క్ అవుట్ అయితే మాత్రం లోకేష్ కి ఇక తిరుగు ఉండదు. కానీ విక్రం రేంజ్ కి ఏమాత్రం తగ్గినా సరే సినిమాను ఆడియన్స్ ఒప్పుకునే ఛాన్స్ లేదు. అందుకే లోకేష్ మీద చాలా పెద్ద బాధ్యత ఉందని చెప్పొచ్చు. విజయ్ ఫ్యాన్స్ కూడా లియో మీద భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. బ్లడీ స్వీట్ అంటూ ఫస్ట్ లుక్ టీజరే హంగామా చేయగా ఈ సినిమాతో మరోసారి అనిరుద్ తన మ్యూజిక్ విజృంభణ చూపించనున్నాడు. లోకేష్ టేకింగ్ అనిరుద్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఉంటాయని చెప్పొచ్చు. లోకేష్ లియో సినిమాను లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. సినిమాతో విజయ్ భారీ టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది.