Begin typing your search above and press return to search.

LCUలో లియో భాగమా కాదా.. ఇదిగో క్లారిటీ

దళపతి విజయ్​ 'లియో' మూవీ మరో రోజులో గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూను ఇచ్చారు తమిళనాడు మినిస్టర్​, హీరో ఉదయ నిధి స్టాలిన్​

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:54 AM GMT
LCUలో లియో భాగమా కాదా..  ఇదిగో క్లారిటీ
X

దళపతి విజయ్​ 'లియో' మూవీ మరో రోజులో గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూను ఇచ్చారు తమిళనాడు మినిస్టర్​, హీరో ఉదయ నిధి స్టాలిన్​. దీని గురించి ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్​ ద్వారా ఇప్పటివరకు ఉన్న సస్పెన్స్​పై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చింది. మరి ఆ ట్వీట్​తో ఆయన నిజంగానే హింట్ ఇచ్చారా లేదా టీజ్​ చేశారా అనే దానిపై పెద్ద చర్చ సాగుతోంది.

వివరాళ్లోకి వెళితే.. లియో చిత్రం ఎల్​సీయూలో భాగమా కాదా అన్న సందేహం సినీ ప్రియుల్లో, విజయ్ ఫ్యాన్స్​లో భారీగా నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్​ 19న రిలీజ్​ అవుతోంది. అంటే రేపు దీనిపై క్లారిటీ రానుంది. కానీ ఈలోగే ఈ విషయమై ఫస్ట్ రివ్యూ అంటూ ఉదయనిధి స్టాలిన్​ ఓ ట్వీట్ పెట్టేసి ఎల్​సీయూ గురించి హింట్ ఇచ్చారు.

లియో సినిమా సూప‌ర్‌. సినిమాలో దళపతి యాక్టింగ్‌, యాక్ష‌న్‌ అదిరిపోయిందని అన్నారు ఉద‌య‌ నిధి స్టాలిన్. లోకేశ్​ క‌న‌క‌రాజ్ ఫిల్మ్ మేకింగ్ అద్భుత‌ంగా ఉందని చెప్పారు. అనిరుధ్ మ్యూజిక్‌, అన్భరివ్​ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌ అని అన్నారు. మొత్తంగా లోకేశ్​ సినిమాటిక్ యూనివ‌ర్స్​ అద్భుతంగా ఉందని చెప్పారు. టీమ్​కు ఆల్​ ది బెస్ట్ చెప్పుకొచ్చారు.

అయితే ఈ ట్వీట్​లో ఎల్​సీయూ అనే పదం బాగా హైలైట్​ అయింది. ఇప్పటివరకు నెలకొన్న సస్పెన్స్​పై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం ఎల్​సీయూలో భాగమేనని అర్థమైంది. కానీ ఇదే సమయంలో కొన్ని అనుమానాలు కూడా రేకెత్తాయి. అదేంటంటే.. లోకేశ్​ విక్రమ్​ సినిమా రిలీజ్​కు ముందు ఖైదీ సినిమా ఓ సారి చూడండంటూ హింట్ ఇచ్చారు. ఎందుకంటే ఆ చిత్రం ఎల్​సీయూలో భాగమని చెప్పడానికి. కానీ ఇప్పుడు లియోకు అలా చేయలేదు.

మరోవైపు ఇంకొంతమంది.. ఉదయనిధి స్టాలిన్​.. లోకేశ్ దాచి ఉంచిన సీక్రెట్​ను​ తొందరపడి ముందుగా చెప్పేశారని అంటున్నారు. ఇంకొంతమంది.. విజయ్ ఫ్యాన్స్​ను టీజ్​ చేయడానికే ఆయన ఇలా ట్వీట్​ పెట్టారా అని కూడా సందేహపడుతున్నారు. మొత్తంగా ఈ ట్వీట్​ మాత్రం ప్రస్తుతం సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అందరూ ఈ విషయం గురించే తెగ మాట్లాడుకుంటున్నారు.