Begin typing your search above and press return to search.

పొలిటిక‌ల్ లీడ‌ర్ సినిమా..థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయి!

ఇక విజ‌య్ ప్ర‌స్తుతం చేస్తోన్న సినిమాతో పాటు మ‌రో సినిమా చేసి న‌ట‌నకు పుల్ స్టాప్ పెడ‌తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   25 March 2024 7:45 AM GMT
పొలిటిక‌ల్ లీడ‌ర్ సినిమా..థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయి!
X

త‌ల‌ప‌తి విజ‌య్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. `తమిళగ వెట్రి కజగం` పేరుతో పార్టీ స్థాపించి 2026 ఎన్నిక‌ల‌కు శ‌మ‌ర శంఖం పూరించారు. విజ‌య్ తెరంగేట్రంతో అభిమానులు ఆనందానికి అవ‌దుల్లేవ్. 2026 లో సీఎం పీఠం ఎక్కేది మా హీరోనే అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం మొద‌లు పెట్టారు. ఇండ‌స్ట్రీ నుంచి కూడా విజ‌య్ కి బాగానే మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. తాము చేయ‌లేనివి విజ‌య్ ద్వారా చేయించాల‌ని కొంత‌మంది హీరోలు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

ఇక విజ‌య్ ప్ర‌స్తుతం చేస్తోన్న సినిమాతో పాటు మ‌రో సినిమా చేసి న‌ట‌నకు పుల్ స్టాప్ పెడ‌తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` అనే సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ రాజ‌కీయ పార్టీ అనౌన్స్ మెంట్ చేసిన త‌ర్వాత రిలీజ్ అవుతున్న తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం. ఇంత‌వ‌ర‌కూ రిలీజ్ తేదిని అధికారికంగా ప్ర‌క‌టించింది లేదు.

పొలిటిక‌ల్ ఎంట్రీ నేప‌థ్యంలో మ‌రింత హ‌డావుడి చోటు చేసుకునే అవ‌కాశం ఉందని అంచానా వేస్తున్నారు. పైగా విజ‌య్ కోట్ల‌లో ఫ్యాన్ బేస్ హీరో కాబ‌ట్టి థియేట‌ర్ల వ‌ద్ద ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. దీంతో` గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` రిలీజ్ పై ఉత్కంఠ మొద‌లైంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌నే టాక్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో తాజాగా రిలీజ్ పై ఓ ఇంట్రెస్టింగ్ లీక్ అందింది.

ఆగ‌స్టులో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ఆలోచ‌నలో ఉన్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. దీంతో షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆగ‌స్టు లో రిలీజ్ అయితే గ‌నుక `లియో` త‌ర్వాత వేగంగా రిలీజ్ అయిన సినిమా ఇదే అవుతుంది. విజ‌య్ సినిమా షూటింగ్ అంటే క‌నీసం ఆరె నెలలు పైగానే ప‌డుతుంది. కానీ `లియో` తో విజయ్ స్పీడ‌ప్ అయ్యారు. ఇప్పుడ‌దే వేగాన్ని `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` కి కొన‌సాగిస్తున్నారు. ఇది పూర్త‌యిన వెంట‌నే మ‌రో చిత్రాన్ని విజ‌య్ ప‌ట్టాలెక్కిస్తారు. ఆ త‌ర్వాత పూర్తిగా రాజ‌కీయాల‌పైనే దృష్టి పెట్ట‌నున్నారు.