Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోతో ఛాన్స్ ఎవ‌రికి??

త‌ల‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా 68వ చిత్రం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శక‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   6 Sep 2023 12:30 AM GMT
ఆ స్టార్ హీరోతో ఛాన్స్ ఎవ‌రికి??
X

త‌ల‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా 68వ చిత్రం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శక‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. 'లియో' నుంచి బ‌య‌ట‌కు రాగానే ఈ చిత్రం షూటింగ్ లోనే పాల్గొంటారు. ఇందులో విజ‌య్ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్నారు. తండ్రి-కొడుకులుగా మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌నున్నారు. ఇప్ప‌టికే త‌న‌యుడి పాత్ర‌కి హీరోయిన్ గా ప్రియాంక‌ మోహ‌నన్ ని ఎంపిక చేసారు. తండ్రి పాత్ర‌కి పెయిర్ ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆ పాత్ర సినిమాలో చాలా కీల‌కంగా ఉంటుందిట‌. కొత్త హీరోయిన్... ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ కంటే? హీరోయిన్ గా పాపుల‌ర్ అయిన పాత వాళ్లు అయితే ఆ పాత్ర కి మ‌రింత గుర్తింపు ఉంటుంద‌ని మేక‌ర్స్ చాలా సెల‌క్టివ్ గా వెళ్తున్న‌ట్లు వినిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఓ ముగ్గురు సీనియ‌ర్ హీరోయిన్ల పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ పాత్రకు సూర్య భార్య జ్యోతికను అనుకుంటున్న‌ట్లు వినిపిస్తోంది.

అయితే ఆమె అంగీక‌రిస్తారా? లేదా? అన్న మ‌రో డౌట్ కూడా రెయిజ్ అవుతుంది. సూర్య‌తో వివాహం త‌ర్వాత జ్యోతిక చాలా సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. లేడీ ఓరియేంటెడ్ క‌థ‌ల్లోనే న‌టిస్తున్నారు. దీంతో మ‌రో ఆప్ష‌న్ గా సిమ్రన్‌ను ప్రయత్నిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆమె కూడా సందేహం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది. జ్యోతిక‌గానీ.. సిమ్ర‌న్ ల నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

దీంతో తాజాగా స్నేహ పేరు ప్రచారంలోకి వచ్చింది. జ్యోతికి..సిమ్ర‌న్ రిజెక్ట్ చేస్తే గ‌నుక ఆస్థానంలో స్నేహ‌ని ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ మ‌రో ప్లాన్ గా పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. స్నేహ సీన్ లోకి వ‌స్తే గ‌నుక విజ‌య్ తో 20 ఏళ్ల త‌ర్వాత క‌లిసి న‌టిస్తోన్న చిత్రం ఇదే అవుతుంది. స‌రిగ్గా 20 ఏళ్ల క్రితం 'వశీకర' చిత్రంలో ఇద్ద‌రు నటించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లి తెర‌ను పంచుకోలేదు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు లండన్‌లో జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది.