Begin typing your search above and press return to search.

రిటైర్మెంట్ కి ముందు అభిమానుల‌కు మ‌రోప్రైజ్!

సినిమాలు వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వెళ్లే ముందు త‌న మ‌రో కోరిక‌ను సైతం నెర వేర్చుకోబుతున్నాడు.

By:  Tupaki Desk   |   12 March 2024 9:30 AM GMT
రిటైర్మెంట్ కి  ముందు అభిమానుల‌కు మ‌రోప్రైజ్!
X

త‌ల‌ప‌తి విజ‌య్ 2026 ఎన్నిక‌ల‌కు స‌న్న‌ధం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సొంతంగా పార్టీ స్థాపించి ప్ర‌జా క్షేత్రంలోకి దిగేసాడు. ప్ర‌స్తుతం వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` అనే సినిమా చేస్తు న్నాడు. ఇది పూర్తయిన వెంట‌నే మ‌రో సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ రెండు చిత్రాలు 2025 క‌ల్లా రిలీజ్ అయిపోతాయి. అయితే ఈ సినిమాలు సెట్స్ లో ఉండ‌గానే విజ‌య్ త‌న‌లో కొత్త కోణాన్ని కూడా ఆవిష్క‌రించ‌బోతున్నాడు. సినిమాలు వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వెళ్లే ముందు త‌న మ‌రో కోరిక‌ను సైతం నెర వేర్చుకోబుతున్నాడు.


గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కోసం ఓ పాట కూడా పాడ‌బోతున్నాడుట‌. ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం విజ‌య్ వాయిస్ ని డ‌బ్బింగ్ చెప్ప‌డం వ‌ర‌కే ప‌రిమితం చేసాడు. ఏనాడు పాట‌లు పాడింది లేదు. కానీ వెంక‌ట్ ప్రభు సినిమా కోసం గాయ‌కుడు కాబోతున్నాడు. దీనికి సంబంధించి ఆ చిత్రానికి సంగీతం అందిస్తున్న యువ‌న్ శంక‌ర్ రాజ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇటీవ‌ల బెంగుళూరులో జ‌రిగిన ఓ క‌చేరీలో ఈ విష‌యాన్ని రివీల్ చేసారు. ఈ పాట‌కు సంబంధించిన రికార్డింగ్ ప‌నులు కూడా పూర్త‌య్యాయ‌ట‌.

ఈ పాట‌ని వెంక‌ట్ ప్ర‌భు తండ్రి గంగై అమ‌ర‌న సాహిత్య‌మందించారు. విజ‌య్ ఆల‌పిస్తాను అన‌డంతో ఆయ న ప్ర‌త్యేకంగా ఈ పాట‌ని రాసిన‌ట్లు స‌మాచారం. ఆ పాట‌ని విజ‌య్ ఎంతో ఎంజాయ్ చేసి పాడారుట‌. ఆ పాట సినిమాలో చాలా ప్రత్యేకంగానూ ఉంటుందిట‌. మ‌రి ఆ పాట ప్ర‌త్యేక‌త ఏంటి? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంది. విజ‌య్ సినిమాల నుంచి త‌ప్పుకునే ముందు అభిమానుల్ని ఈ ర‌కంగా కూడా అల రించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇంత వ‌ర‌కూ ఏ సినిమా కోసం పాట‌లు పాడింది లేదు. ఆయ‌న‌తో పాడించాల‌ని చాలా మంది మేక‌ర్స్ ప్ర‌యత్నించారు గానీ ప‌న‌వ్వ‌లేదు. కానీ తొలిసారి వెంక‌ట్ ప్ర‌భు ఛాన్స్ తీసుకోవ‌డం యువ‌న్ శంక‌ర్ రాజా కూడా ప‌ట్టు బ‌ట్ట‌డంతో కాద‌న‌కుండా విజ‌య్ అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిస్తున్నారు. విజ‌య్ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.