Begin typing your search above and press return to search.

విశ్వంభర - రాములమ్మ.. నిజం అయితే బాగుండు!

ఇప్పటికే చిరంజీవి మరియు త్రిష పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు.

By:  Tupaki Desk   |   23 April 2024 5:07 AM GMT
విశ్వంభర - రాములమ్మ.. నిజం అయితే బాగుండు!
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. ఇప్పటికే చిరంజీవి మరియు త్రిష పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు.

చిరంజీవి మండే ఎండలను లక్ష్య పెట్టకుండా విశ్వంభర సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. అంతే కాకుండా బాడీ డబుల్ లేకుండా కూడా పలు యాక్షన్ సన్నివేశాల షూటింగ్‌ చేస్తున్నాడు. మొత్తానికి విశ్వంభర సినిమా పై అంచనాలు అంతకంతకు పెంచేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విశ్వంభర సినిమాలోని కీలకమైన ఫీమేల్‌ పాత్రకు గాను సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతిని సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న రాములమ్మ విశ్వంభర కి ఓకే చెప్పేనా అనేది చూడాలి.

చిరంజీవి - విజయశాంతి ల కాంబో హిట్ కాంబో అనే విషయం తెల్సిందే. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మద్య గ్యాప్ ఏర్పడింది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా వేడుక సమయంలో చిరంజీవి మరియు విజయశాంతి లు మాట్లాడుకున్నారు. ఆ సమయంలోనే ఛాన్స్ ఉంటే కలిసి నటిస్తామని అన్నారు.

గతంలో వీరిద్దరు చేసిన హిట్ సినిమాల తాలూకు జ్ఞాపకాలు అభిమానులను వెంటాడుతూనే ఉంటాయి. అలాంటిది మళ్లీ వీరిద్దరు కలిసి నటిస్తే కచ్చితంగా ఓ రేంజ్ లో బజ్ క్రియేట్‌ అవ్వడం ఖాయం. అందుకే చిరంజీవి సినిమాలో రాములమ్మ ఉంటే బాగుండు అని చాలా మంది అనుకుంటున్నారు. విశ్వంభర లో రాములమ్మ వార్తలపై యూనిట్‌ సభ్యుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.