Begin typing your search above and press return to search.

డోంట్ స్పాయిల్ ద మూవీ.. అలాంటోళ్లకి నా వార్నింగ్ ..!

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను ఆదరించిన రెండు రాష్ట్రాల ప్రజలందరికీ నా పాదాభివందనాలు అంటూ విజయశాంతి స్పీచ్ మొదలు పెట్టారు.

By:  Tupaki Desk   |   19 April 2025 5:20 PM
డోంట్ స్పాయిల్ ద మూవీ.. అలాంటోళ్లకి నా వార్నింగ్ ..!
X

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో సినిమాలో కీలక పాత్ర చేసిన విజయశాంతి స్పీచ్ ఆకట్టుకుంది.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను ఆదరించిన రెండు రాష్ట్రాల ప్రజలందరికీ నా పాదాభివందనాలు అంటూ విజయశాంతి స్పీచ్ మొదలు పెట్టారు. ఈ సినిమా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రజలు లేకపోతే ఏ హీరో లేడు.. ఏ హీరోయిన్ లేదు.. ఎవరు లేరు.. ఈరోజు ఈ సినిమా ఇంత మంచి హిట్ అయ్యింది అంటే ఆ క్రెడిట్ అంతా ప్రజలదే అని అన్నారు విజయశాంతి.

హీరోలు హీరోయిన్స్ డల్ గా ఉన్నా మళ్లీ వారిలో ఆ జోష్ ఇచ్చేది ప్రజలే.. సినిమా అందరు బాగుంది అంటున్నారు కాబట్టి డే బై డే గ్రాఫ్ పెరుగుతూ వెళ్తుంది.

ఐతే కొంతమంది కొంత డిస్టర్బ్ చేయడానికి ఉంటారు. అది వాళ్ల సంస్కారం. అది వాళ్ల శాడిజం అంటారో ఇనేకమంటారో నాకు తెలియదు. ఏ సినిమాకైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్మాత సినిమా తీస్తాడు. హీరోలు, డైరెక్టర్లు, టెక్నిషియన్లు అంతా కష్టపడి పనిచేస్తారు. ఐతే ఇలా కొందరు చేసే నెగితివిటీ వల్ల వాళ్లకు అసౌకర్యం కలుగుతుందని అన్నారు విజయశాంతి.

ఈమధ్య వాంటెడ్ గా కొన్ని చేస్తున్నారు.. చూస్తున్నాను.. వింటున్నాను.. ఏ సినిమా అయినా ఏ సినిమా అయినా.. ఏ హీరో సినిమా అయినా.. నెగిటివ్ మాట్లాడటం మంచి పద్ధతి కాదు.. ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేమందరం కోరుకుంటాం. బాగాలేనిది బాగుందని.. బాగున్న దాన్ని బాగాలేదని.. ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదు.. దయచేసి ఎవరెవరు ఇలాటి తప్పులు చేస్తున్నారో.. వాళ్లు మైండ్ సెట్ మార్చుకోవాలని అన్నారు విజయశాంతి.

ఇండస్ట్రీని బతకనివ్వండి.. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా... ఎంతోమంది ఎన్నో హోప్స్ పెట్టుకుని ఇండస్ట్రీకి వస్తారు.. వాళ్లను ఆశీర్వదించండి.. మీకు సినిమా నచ్చకపోతే చూడొద్దు.. క్వైట్ గా ఉండండి.. కానీ సినిమాను కూనీ చేద్దామని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి వాళ్లకు నేను వార్నింగ్ ఇస్తున్నా.. దయచేసి ఆపండని అన్నారు విజయశాంతి.

అంతేకాదు ఏదో ఒక రూపంలో వస్తున్నారు.. డిస్ట్రబ్ చేస్తున్నారు.. థియేటర్ కి వెళ్తే ప్రజలు సినిమా అద్భుతం అంటున్నారు. పాజిటివ్ గా చెబుతున్నారు. మీరు పైశాచిక ఆనందం పొందొద్దు.. మన స్పూర్తిగా దీవించడం నేర్చుకోండి..మీకు ఎవరైనా వెనకాల నుంచి గెలుకుతూ మైండ్ వాష్ చేస్తూ ఉంటే వాళ్ల దగ్గరకు వెళ్లి చెంచా కొట్టుకోండి.. కానీ డోంట్ స్పాయిల్ ద మూవీ.. ఇది మంచి పద్ధతి కాదు... కొన్ని జీవితాలు పోతాయని అన్నారు విజయశాంతి.

ఈమధ్య సోషల్ మీడియాలో సినిమా టాక్ తో సంబంధం లేకుండా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న వారి మీద డైరెక్ట్ ఎటాక్ కి దిగారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. సినిమాకు నెగిటివ్ చేయొద్దు.. సినిమా పరిశ్రమని చంపొద్దు అంటూ తన స్పీచ్ తో అలరించారు విజయశాంతి.