Begin typing your search above and press return to search.

స్టార్‌ నటుడు షాకింగ్ నిర్ణయం

తాజాగా గోవా లో జరిగిన 'ఇఫి' వేడుకలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నాకు విలన్ పాత్రలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 4:42 AM GMT
స్టార్‌ నటుడు షాకింగ్ నిర్ణయం
X

హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న విజయ్ సేతుపతి తాజాగా తీసుకున్న నిర్ణయం ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా షాకింగ్ గా ఉంది అనడంలో సందేహం లేదు. హీరో గా మంచి సినిమాలు వస్తున్న సమయంలో విలన్‌ వేశాలు వేయడం మొదలు పెట్టిన విజయ్ సేతుపతి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

ఇక మీదట విలన్‌ గా నటించబోను అంటూ ప్రకటించాడు. కొన్నాళ్ల పాటు విలన్ వేషాలకు దూరంగా ఉంటాను అంటూ విజయ్‌ సేతుపతి అధికారికంగా ప్రకటించడం తో ఆయన తో సినిమాలు ప్లాన్ చేసుకున్న వారు, చేసుకుంటున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హీరో గా కంటే విలన్ గా అద్భుత నటన కనబరుస్తున్న విజయ్ సేతుపతి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారకరం అంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా గోవా లో జరిగిన 'ఇఫి' వేడుకలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. నాకు విలన్ పాత్రలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నాతో విలన్ పాత్రలు చేయిస్తున్న దర్శకులు, హీరోలు నన్ను ఎమోషనల్‌ గా ప్రెజర్ చేస్తున్నారు. వారిని నేను ఎదుర్కోలేక పోతున్నాను. దాంతో నేను వారు చెప్పినట్లుగా చాలా సార్లు చేయాల్సి వస్తుంది.

ఎమోషనల్‌ గా ప్రెజర్ చేస్తున్న సమయంలో ఏది కరెక్ట్‌.. ఏది సరి కాదు అనేది నిర్ణయం తీసుకోలేక పోతున్నాను. అందుకే నేను కొన్నాళ్ల పాటు విలన్ వేషాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అంటూ ప్రకటించాడు. ఇప్పటికే కమిట్‌ అయిన సినిమా లను ముగించి, కొత్త వాటికి ఓకే చెప్పను అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు.

ఉప్పెన మొదలుకుని మొన్న వచ్చిన జవాన్ వరకు ఎన్నో సినిమా ల్లో అద్భుతమైన విలనిజం తో విజయ్ సేతుపతి మెప్పించాడు. పవర్‌ ఫుల్‌ విలన్ కావాలి అంటే బాలీవుడ్‌ వైపు చూసే మన వారికి విజయ్ సేతుపతి బెస్ట్‌ ఆప్షన్ అయ్యాడు. అలాంటి విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలకు గుడ్‌ బై చెప్పడం తో ఇప్పుడు దర్శక నిర్మాతలు ఎటు చూస్తారో మరి...!