Begin typing your search above and press return to search.

సింప్లిసిటీ లేబుల్ పై విజయ్ సేతుపతి కామెంట్..!

తను వేసుకునే కాస్ట్యూమ్స్ ఖరీదైనవే.. తనకు కంఫర్ట్ గా ఉండే దుస్తులను వేసుకుంట.. ఖరీదైనవే వేసుకుంటా.. సింప్లిసిటీ అనేది తనకు వర్తించదు.

By:  Tupaki Desk   |   7 Jan 2024 5:02 AM GMT
సింప్లిసిటీ లేబుల్ పై విజయ్ సేతుపతి కామెంట్..!
X

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కేవలం తమిళంలోనే కాదు మిగతా భాషల్లో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తెలుగులో ఉప్పెనలో నెగిటివ్ పాత్రలో అదరగొట్టిన విజయ్ సేతుపతి రీసెంట్ గా బాలీవుడ్ లో జవాన్ సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం మెర్రీ క్రిస్మస్ సినిమాలో నటించిన విజయ్ సేతుపతి ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.

విజయ్ సేతుపతి అనగానే అందరు సింప్లిసిటీ అనేస్తుంటారు. అయితే తనకు ఆ సింప్లిసిటీ లేబుల్ వద్దని అంటున్నాడు విజయ్ సేతుపతి. తను వేసుకునే కాస్ట్యూమ్స్ ఖరీదైనవే.. తనకు కంఫర్ట్ గా ఉండే దుస్తులను వేసుకుంట.. ఖరీదైనవే వేసుకుంటా.. సింప్లిసిటీ అనేది తనకు వర్తించదు. సింప్లిసిటీ లేబుల్ తనకు వద్దని అంటున్నారు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మస్ ప్రమోషన్స్ సందర్భంగా ఆ సినిమా విషయాలతో పాటు తన గురించి కూడా మాట్లాడారు విజయ్ సేతుపతి.

సినిమాలో కత్రినా కైఫ్ ఫిమేల్ లీడ్ గా నటించింది. కత్రినా తో స్క్రీన్ షేర్ చేసుకుంటానని అసలు ఎప్పుడు అనుకోలేదు. ఆమెకు తాను పెద్ద అభిమానిని.. ఆమెను మొదటిసారి సెట్ లో చూసినప్పుడు సంతోషించా.. నా ఆనందాన్ని సరిగా చూపించలేకపోయానని అన్నారు. కత్రినా గురించి చెబుతూ ఆమెకు మెమరీ చాలా ఎక్కువ.. విషయం ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. డౌట్స్ ఏమన్నా ఉంటే వాటిని సరిచేసుకుంటుంది. అందం ఒక్కటే ఉంటే ఇన్నేళ్లు కొనసాగించడం కష్టం ఆమె తెలివితో పరిశ్రమలో రాణిస్తున్నారని చెప్పారు విజయ్ సేతుపతి.

తను చేస్తున్న సినిమాలు.. ఎంచుకుంటున్న పాత్రలతో నటుడిగా సూపర్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ సేతుపతి సింప్లిసిటీగా ఉంటారన్న టాక్ ఉంది. అయితే తను వేసుకునే బట్టలు ఖరీదైనవే.. తను మీరనుకున్నంత సింపుల్ గా ఉండనని తనకు సింప్లిసిటీ అనే లేబుల్ వద్దని విజయ్ సేతుపతి చెప్పడం అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

మెర్రీ క్రిస్మస్ విషయానికి వస్తే ఒక రాత్రి జరిగిన సంఘటన తో ఇద్దరి జీవితాలు ఎలా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పే థ్రిల్లర్ కథాంశంతో చేసిన సినిమా ఇది. శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతుంది.