Begin typing your search above and press return to search.

RC 16 లో బుచ్చిబాబు మెచ్చిన విల‌న్!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయుడిగా 16వ చిత్రం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Aug 2023 12:15 PM GMT
RC 16 లో బుచ్చిబాబు మెచ్చిన విల‌న్!
X

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయుడిగా 16వ చిత్రం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది సినిమా ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే సంగీత ద‌ర్శ‌కుడిగా ఏ. ఆర్. రెహ‌మాన్ ని ఒప్పించిన‌ట్లు తెలుస్తోంది. రెహ‌మాన్ ఎంట్రీ సినిమాకి అద‌న‌పు అస్సెట్. తాజాగా బుచ్చి బాబు న‌టీనటుల ఎంపిక‌పై ఫోక‌స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా చ‌ర‌ణ్ కి ధీటైన విల‌న్ గా మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తిని తీసుకున్న‌ట్లు వినిపిస్తోంది.

ఇదే నిజ‌మైతే మ‌క్క‌ల్ సెల్వ‌న్ ఎంట్రీ సినిమాకి మ‌రో అస్సెట్ అని చెప్పొచ్చు. ఆయ‌న న‌టన గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియాలో ఫాలోయింగ్ ఉన్న న‌టుడు. అన్ని భాష‌ల్లో సినిమాలు చేయ‌క‌పో యినా అనువాద చిత్రాల‌తోనే ఆ ఘ‌న‌త సాధించిన న‌టుడాయ‌న. బుచ్చి బాబుతో సేతుప‌తి ర్యాపో ప్ర‌త్యేక‌మైన‌ది. బుచ్చి బాబు తొలి సినిమా ఉప్పెన సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాతోనే టాలీవుడ్ లో విల‌న్ గా లాంచ్ అయ్యారు.

నేచుర‌ల్ పెర్పార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసిన సినిమా అది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి విల‌న్ గా సేతుప‌తి పేరు తెర‌పైకి రావ‌డం ఆస‌క్తిక‌రం. గ‌తంలో సేతుప‌తి `సైరా న‌ర‌సింహారెడ్డి` లోనూ ఓకీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. అందులో ఉయ్యాల వాడ అనుచ‌రి పాత్ర‌లో మెప్పించాడు. ఆ రోల్ ఎమోష‌నల్ గా క‌నెక్ట్ అయింది. అలా మెగాస్టార్ తో క‌లిసి ప‌నిచేసారు. బుచ్చి బాబు ఆఫ‌ర్ తో త‌న‌యుడితో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా అయినా బుచ్చిబాబు మాత్రం స్థానిక న‌టుల‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు.

సినిమాలో హీరోయిన్ గా కూడా తెలుగు అమ్మాయిని తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ఇప్ప‌టికే రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రి అందులో ఎంత‌వ‌ర‌కూ స‌ఫ‌లం అవుతారు? అన్న‌ది చూడాలి.