Begin typing your search above and press return to search.

హీరో షాకింగ్ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ స‌ర్ ప్రైజింగ్ !

అయితే మరో హిందీ చిత్రం 'మేరి క్రిస్మ‌స్' కోసం విజ‌య్ శ‌రీరంలో చాలా మార్పులే చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. శ్రీరామ్ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ త‌మిళ్..హిందీలో తెర‌కెక్కిస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 6:33 AM GMT
హీరో షాకింగ్ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ స‌ర్ ప్రైజింగ్ !
X

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి యాక్టింగ్ స్కిల్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండియాన్ గ్రేట్ యాక్ట‌ర్స్ లో విజ‌య్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్...క‌మ‌ల్ హాస‌న్ త‌ర్వాత అంత‌టి పేరు ప్ర‌ఖ్యాత‌లు విజ‌య్ ద‌క్కించుకుంటాడ‌ని గెస్సింగ్స్ ఉన్నాయి. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల న‌టుడు. పాత్ర‌కి త‌గ్గ‌ట్టు త‌న‌ని మౌల్డ్ చేసుకోగ‌ల గొప్ప న‌టుడు. ఇక విజ‌య్ కెరీర్ ఆరంభంలో బాగా స‌న్న‌గా స్లిమ్ గా ఉండేవారు. ఆ త‌ర్వాత క్ర‌మంలో పాత్ర‌ల డిమాండ్ మేర‌కు వెయిట్ పెర‌గ‌డం జ‌రిగింది.

చాలా కాలం పాటు అదే వెయిట్ తో చాలా సినిమాల్లో న‌టించాడు. ఇక 'విక్ర‌మ్' సినిమాలో విజ‌య్ భారీ దేహంతో ఎంట్రీ ఇచ్చిన స‌న్నివేశం ఏ రేంజ్ లో హైలైట్ అయిందో తెలిసిందే. ఆ పాత్రం కోసం 90కేజీల‌కు పైగానే బ‌రువు పెర‌గాల్సి వ‌చ్చింది. ఎత్తైన బొజ్జు..ఛాతీ...చేతి కండ‌రాలు..వీపు భాగంలో పాము బొమ్మ‌తో ఆరోల్ ని లొకేష్ క‌న‌గ‌రాజ్ ఓ రేంజ్ లో హైలైట్ చేసాడు. ఆ త‌ర్వాత న‌టించిన చాలా సినిమాల్లో అదే వెయిట్ తో క‌నిపించాడు. బాలీవుడ్ సినిమా 'జ‌వాన్' లోనూ అలాగే హైలైట్ అయ్యాడు.

అయితే మరో హిందీ చిత్రం 'మేరి క్రిస్మ‌స్' కోసం విజ‌య్ శ‌రీరంలో చాలా మార్పులే చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. శ్రీరామ్ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ త‌మిళ్..హిందీలో తెర‌కెక్కిస్తున్నారు. 60 కోట్ల బ‌డ్జెట్ తో చిత్రాన్ని టిప్స్ పిలిసిం..మ్యాచ్ బాక్స్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో విజ‌య్ సేతుప‌తికి జోడీగా క‌త్రినా కైఫ్ న‌టిస్తోంది. ఇక క్యాట్ బ్యూటీ ముందు విజ‌య్ ఎలా ఉంటాడు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి హైప్ తీసుకొస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో విజ‌య్ సేతుప‌తి లుక్ కూడా భారీగా ఛెంజెస్ తీసుకొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. వెయిట్ లాస్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది. మునుప‌టి క‌న్నా స్లిమ్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. తాజాగా ఆ సినిమా నుంచి ఓ కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. అందులో క‌త్రినా ప‌క్క‌నే విజ‌య్ క‌నిపిస్తున్నాడు. సూటుబూటు ధ‌రించి క‌నిపిస్తు న్నాడు. ముఖం నుంచి కాలి వ‌ర‌కూ ప్ర‌తీ భాగంలోనూ మార్పులు క‌నిపిస్తున్నాయి. విజ‌య్ స్లిమ్ లుక్ లో అలా క‌నిపించే స‌రికి ఇత‌ను మ‌క్క‌ల్ సెల్వ‌న్ నేనా? అన్న సందేహం రాక మాన‌దు. కెరీర్ ఆరంభంలో ఎలాంటి లుక్ లో ఉండే వారు అలాగే ఉన్నాడిప్పుడు.