Begin typing your search above and press return to search.

విలక్షణ నటుడి అప్పటి వీడియో.. ఇప్పుడు వైరల్..!

ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   19 March 2024 2:30 PM GMT
విలక్షణ నటుడి అప్పటి వీడియో.. ఇప్పుడు వైరల్..!
X

సినీ స్టార్స్ పాలిటిక్స్ గురించి మాట్లాడినా.. పాలిటిక్స్ లో వచ్చినా అదో రకమైన క్రేజ్ ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు మైక్ ముందు ఎంత మాట్లాడినా పట్టించుకోని జనం ఒక హీరో జస్ట్ రాజకీయాల పైన తన అభిప్రాయం చెప్పినా సరే అది వైరల్ చేస్తారు. తెలుగు, తమిళ భాషల్లో చాలామంది స్టార్స్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. కొందరు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా ఏదో ఒక సందర్భంలో వారు రాజకీయాల గురించి తమ అభిప్రాయాలు చెప్పాల్సి వస్తుంది. ఆ టైం లో వారు మాట్లాడిన మాటలు హా**ట్ న్యూస్ గా మారుతాయి. అంతేకాదు అలాంటి వీడియోస్ ని వైరల్ చేస్తారు.

ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దేశం మొత్తం ఎన్నికల సందడి మొదలు కాబోతుంది. మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఈ టైం లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇంతకీ విజయ్ సేతుపతి ఏం మాట్లాడాడు అంటే.. కుల, మతాల ప్రస్తావన తెచ్చే రాజకీయ నాయకులకు ఓటు వేయొద్ధు. మనకు మంచి చేసే వారికి ఓటు వేయండి. మన ఊరు, మన రాష్ట్ర బాగు చేసే వారికి ఓటు వేయండి అని ఆ వీడియోలో ఉంది.

అయితే విజయ్ సేతుపతి ఎప్పుడో ఒక సందర్భంలో చెప్పిన ఈ వీడియో ఎన్నికల టైం కాబట్టి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా తన సత్తా చాటుతున్న విజయ్ సేతుపతి అటు సోలో సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రతినాయకుడిగా తన మార్క్ చూపిస్తున్నాడు. హీరోగా, విలన్ గా కాదు నటుడిగా తన టాలెంట్ చూపిస్తూ నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు.

తెలుగులో కూడా విజయ్ సేతుపతి సైరా నరసింహా రెడ్డి, ఉప్పెన సినిమాల్లో నటించారు. ఉప్పెన సినిమాలో అతను చేసిన శేషా రాయణం పాత్ర సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలిచింది. తమిళ భాషలో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నా చేయలేకపోతున్నాడు విజయ్ సేతుపతి. షారుఖ్ జవాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి ఈమధ్యనే మెర్రీ క్రిస్మస్ సినిమాతో మరోసారి బీ టౌన్ ఆడియన్స్ ని అలరించారు.