Begin typing your search above and press return to search.

అతని కోసమే ఉప్పెన శేషారాయణం..!

కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తమిళంలో వరుస సినిమాలతొ బిజీగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   11 Jun 2024 6:36 AM GMT
అతని కోసమే ఉప్పెన శేషారాయణం..!
X

కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తమిళంలో వరుస సినిమాలతొ బిజీగా ఉన్నారు. తెలుగులో సైరా నరసింహా రెడ్డి, ఉప్పెన సినిమాల్లో నటించిన విజయ్ సేతుపతి హిందీలో కూడా జవాన్, మెర్రి క్రిస్మస్ సినిమాల్లో నటించారు. లేటెస్ట్ గా మహారాజ సినిమాతో వస్తున్నారు విజయ్ సేతుపతి. జూన్ 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ సేతుపతి తాను ఉప్పెన సినిమా చేయడానికి వెనుక రీజన్ చెప్పారు. ఉప్పెన సినిమాలో హీరోయిన్ ఫాదర్ శేషారాయణం పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టారు.

ఆ సినిమాకు స్టార్ అప్పీల్ వచ్చింది అంటే అది విజయ్ సేతుపతి వల్లే. సినిమాలో శేషారాయణం పాత్రలో ఆ గంభీరత్వం సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. విజయ్ సేతుపతి ఇమేజ్ ని బుచ్చి బాబు పర్ఫెక్ట్ గా వాడుకున్నారని చెప్పొచ్చు. ఐతే ఉప్పెన సినిమాలో తండ్రి పాత్ర కేవలం డైరెక్టర్ బుచ్చి బాబు కోసమే చేశానని అన్నారు విజయ్ సేతుపతి. బుచ్చి బాబుకి సినిమా మీద ఉన్న ప్యాషన్ నచ్చిందని.. తన కోసమే ఉప్పెనలో ఆ పాత్ర చేశానని అన్నారు విజయ్ సేతుపతి. డైరెక్టర్ ని అంత నమ్మి చేశాడు కాబట్టి ఆయన పాత్ర ఆ రేంజ్ లో హైలెట్ గా నిలిచింది.

కోలీవుడ్ లో హీరోగా విలన్ గా తన మార్క్ చూపిస్తూ వస్తున్న విజయ్ సేతుపతి రీసెంట్ గానే ఇక మీదట మల్టీస్టారర్ సినిమాలు చేయనని చెప్పేశాడు. మల్టీస్టారర్ సినిమాల్లో ఎక్కువగా తనకు నెగిటివ్ రోల్స్ రావడమే దీనికి ముఖ్య కారణమని తెలుస్తుంది. అంతేకాదు స్టార్ సినిమాల్లో తాను ఎంత గొప్పగా చేసినా ఆ క్రెడిట్ అంతా కూడా వారికే దక్కుతుందని భావిస్తున్నాడు విజయ్ సేతుపతి.

మహారాజ సినిమాను తెలుగు ఆడియన్స్ కు నచ్చుతుందని ఇక్కడ ప్రేక్షకులు మంచి సినిమాను ఆదరిస్తారని అన్నారు విజయ్ సేతుపతి. ఎంతో విజన్ తో సినీ పరిశ్రమకు కావాల్సిన అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన రామోజీ ఫిల్మ్ సిటీ ఎన్నో సినిమాలకు సపోర్ట్ చేసింది. 2005 లోనే తాను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేశాను. అలాంటి రామోజీ రావు మృతి చెందడం దిగ్బ్రాంతికి గురి చేసింది.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని అన్నారు విజయ్ సేతుపతి.