Begin typing your search above and press return to search.

ఆ స్టార్ డెసిష‌న్ తో అంతా ఛేంజ్!

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుపతి అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల గొప్ప న‌టుడు

By:  Tupaki Desk   |   11 Jan 2024 2:45 AM GMT
ఆ స్టార్ డెసిష‌న్ తో అంతా ఛేంజ్!
X

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుపతి అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల గొప్ప న‌టుడు. హీరో అయినా..విల‌న్ అయినా...క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయినా ఎలాంటి పాత్ర‌నైనా అవ‌లీ ల‌గా పోషించ‌గ‌ల‌డు. క‌మ‌ల్ స‌హాన్..ర‌జ‌నీకాంత్..విక్ర‌మ్ త‌ర్వాత న‌ట‌న ప‌రంగా మ‌క్క‌ల్ సెల్వ‌న్ దే ఆ స్థానం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఇంత గొప్ప పేరు రావ‌డానికి కార‌ణం ఆయ‌న ఇమేజ్ అనే చ‌ట్రంలో ఇరుకోక్కుండా అన్ని ర‌కాల పాత్ర‌లు పోషించ‌డంతోనే సాధ్యమైంది.

ఆ క్రేజ్ తోనే అన్ని భాష‌ల్లోనూ అవ‌కాశాలు అందుకుంటున్నాడు. త‌మిళ‌న‌టుడైనా అన్ని ప‌రిశ్ర‌మ‌లు విజ‌య్ సేతుప‌తికి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. అలాంటి న‌టుడు సంచ‌ల‌న నిర్ణయంతో అంతా షాక్ అవుతున్నారు. ఇక‌పై హీరోగా త‌ప్ప ఇంకెలాంటి పాత్ర‌లు పోషించ‌న‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇది ద‌ర్శ‌నిర్మాత‌ల‌తో పాటు అభిమానుల‌కు షాకింగ్ అనే చెప్పాలి.

మ‌క్క‌ల్ సెల్వ‌న్ అంటే కేవ‌లం హీరోగానే ఊహించుకోరు. అన్ని ర‌కాల పాత్ర‌ల్లోనూ అత‌న్ని ఊహించుకుం టారు అభిమానులు. అయితే స‌మ‌స్య ద‌ర్శ‌కుల‌కే. ఇప్ప‌టికే విజ‌య్ సేతుప‌తిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ద‌ర్శ‌కులు క‌థ‌లు..ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లు రాస్తున్నారు. బుచ్చిబాబు సానా కొత్త చిత్రంలో నూ విజ‌య్ కోసం ఓ పాత్ర రాసిన‌ట్లు వెలుగులోకి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో తాజా నిర్ణ‌యంతో బుచ్చి బాబు రీప్లేస్ చేసుకోవాల్సిందేనేమో.

ఇంకా చాలా మంది ద‌ర్శ‌కులు ఈర‌క‌మైన స‌మ‌స్య‌ని అధిగ‌మించాల్సి ఉంది. ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాలు తెర‌కెక్కుతోన్న నేప‌థ్యంలో విజ‌య్ లాంటి న‌టుడు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం నిరుత్సా హ ప‌రిచేదే. విక్ర‌మ్ లో సంతానం పాత్ర‌ని ఎంత గొప్ప‌గా పండిచాడో చూసాం. ఆపాత్ర కి తాను మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని నిరూపించిన న‌టుడాయ‌న‌. తాజా నిర్ణ‌యంతో అన్నీ తారుమ‌రవుతున్న‌ట్లే.