Begin typing your search above and press return to search.

రేపు మొత్తం మారబోతుంది.. రౌడీ స్టార్‌ సస్పెన్స్‌

రౌడీ క్లబ్‌ అంటూ ఒక బ్రాండ్‌ ను విజయ్ దేవరకొండ నడుపుతున్న విషయం తెల్సిందే. రౌడీ క్లబ్‌ డ్రెస్ లకు యూత్ లోవిపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 3:05 PM GMT
రేపు మొత్తం మారబోతుంది.. రౌడీ స్టార్‌ సస్పెన్స్‌
X

విజయ్ దేవరకొండ సోషల్‌ మీడియాలో చాలా అరుదుగా పోస్ట్‌ లు చేస్తూ ఉంటాడు. అలాంటిది తన సోషల్‌ మీడియా ద్వారా రేపు మొత్తం మారిపోబోతుంది అంటూ సాయంత్రం 3 గంటలు అని కూడా టైమ్‌ ను షేర్ చేశాడు. అంతే కాకుండా రౌడీ క్లబ్ పేజ్‌ ని ట్యాగ్‌ చేశాడు. దాంతో రౌడీ స్టార్‌ ఉద్దేశ్యం ఏంటి, అసలు ఏం మారబోతుంది అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

రౌడీ క్లబ్‌ అంటూ ఒక బ్రాండ్‌ ను విజయ్ దేవరకొండ నడుపుతున్న విషయం తెల్సిందే. రౌడీ క్లబ్‌ డ్రెస్ లకు యూత్ లోవిపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. భారీ లాభాలను కూడా రౌడీ క్లబ్‌ తెచ్చి పెడుతుంది అని మార్కెట్‌ లో టాక్‌ ఉంది. ఆ విషయం పక్కన పెడితే విజయ్ దేవరకొండ రౌడీ క్లబ్ గురించి రేపు చెప్పబోతున్న విషయం ఏంటి అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాను చేస్తున్నాడు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఒక వైపు ఫ్యామిలీ స్టార్‌ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యం లో సోషల్‌ మీడియాలో పదే పదే ఆ సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ రౌడీ క్లబ్‌ గురించి రేపు ఆసక్తికర విషయాన్ని చెప్పే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రౌడీ ఫ్యాన్స్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.