Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ వివాదం చెక్ పెట్టిన ప‌వ‌ర్ స్టార్!

ఒక్క‌రే సూప‌ర్ స్టార్ ఆయ‌నే ర‌జ‌నీకాంత్.. ఒక్క‌రే ఉల‌గనాయ‌గ‌న్ ఆయ‌నే క‌మ‌ల్ హాస‌న్.. ఒక్క‌రే త‌లా అత‌నే అజిత్.. ఇక నేను ద‌ళ‌ప‌తిని..ద‌ళ‌ప‌తి అంటే రాజు ఆదేశాన్ని పాటించే వాడు అని అర్దం.

By:  Tupaki Desk   |   2 Nov 2023 4:00 PM GMT
సూప‌ర్ స్టార్ వివాదం చెక్ పెట్టిన ప‌వ‌ర్ స్టార్!
X

కోలీవుడ్ హీరో విజ‌య్ పేరు ఈ మ‌ధ్య వివాదాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. 'లియో' పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల నుంచి సూప‌ర్ స్టార్ వివాదం వ‌ర‌కూ విజ‌య్ పై మీడియాలో వాడివేడి చ‌ర్చ సాగింది. ఈ రెండింటికంటే ముందు త‌ల అజిత్ తో పోటీ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో అభిమానుల వైరం ఎప్పుడూ సంచ‌ల‌న‌మే . ఎప్ప‌టిక‌ప్పుడు ఇద్ద‌రు హీరోల మ‌ధ్య నెట్టింట వాగ్వివాదం జ‌రుగుతుంటుంది.

తాజాగా అన్ని వివాదాల‌పై విజ‌య్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసాడు. 'లియో' స‌క్సెస్ మీట్ వేదిక‌గా అన్నింటిపై నోరు విప్పారు. 'ఆ పాట లిరిక్స్ లో చేతి వేళ్ల మ‌ధ్య‌లో టార్చ్ అనే లైన్ ఉంటుంది. దానిని సిగ‌రెట్ అనే ఎందుకు అనుకోవాలి? ఓ పెన్ను అని కూడా అనుకోవ‌చ్చు క‌దా? ఇలా నేను జ‌వాబు ఇవ్వాలంటే? ఎన్నో విష‌యాలు ఉన్నాయి. కానీ ఇక్క‌డ నేను అన్నింటి గురించి మాట్లాడాలి అనుకోవ‌డం లేదు.

ఓ సినిమాని సినిమాలాగే చూడాల‌ని కోరుకుంటున్నా. వినోదంలో మంచి చెడు రెండు ఉంటాయి. వాటిని కేవ‌లం వినోదం అనే కోణంలో చూడండి. మంచిని మాత్ర‌మే తీసుకోండి. చెడును థియేట‌ర్లోనే వ‌దిలేయండి. అలాగే త‌మిళంలో ఒక్క‌రే త‌లైవర్ ఆయ‌నే ఎంజీ రామ‌చంద్ర‌న్. ఒక్క‌డే న‌డిగ‌ర్ తిల‌గం ఆయ‌నే శివాజీ గ‌ణేష‌న్.. ఒక్క‌రే సూప‌ర్ స్టార్ ఆయ‌నే ర‌జ‌నీకాంత్.. ఒక్క‌రే ఉల‌గనాయ‌గ‌న్ ఆయ‌నే క‌మ‌ల్ హాస‌న్.. ఒక్క‌రే త‌లా అత‌నే అజిత్.. ఇక నేను ద‌ళ‌ప‌తిని..ద‌ళ‌ప‌తి అంటే రాజు ఆదేశాన్ని పాటించే వాడు అని అర్దం.

అభిమానులంతా నా రాజులు. నేను మీసేవ‌కుడిని మాత్ర‌మే. నా కోసం ప్రాణ‌మిచ్చే అభిమానులున్నారు. మీ ప్రేమని ఎలా తిరిగివ్వాలో తెలియ‌డం లేదు. మీరంతా నా గుండెల్లోనే ఉన్నారు. నా దృష్టిలో మీ అంద‌రి హృద‌యాలు దేవాల‌యాలు. నా నుంచి ఏమీ ఆశించ‌కుండా చూపించే మీ గొప్ప ప్రేమ‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డే ఉంటాను' అని అన్నారు.