Begin typing your search above and press return to search.

విజయ్ మూవీ కెరీర్లో బిగ్గెస్ట్..!

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 5:47 AM GMT
విజయ్ మూవీ కెరీర్లో బిగ్గెస్ట్..!
X

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ అసలైతే ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నా సంక్రాంతి పోటీ ఎక్కువ అవ్వడం వల్ల సినిమా వాయిదా వేసుకున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ పరశురాం విజయ్ దేవరకొండ కాంబో గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మళ్లీ అదే రిజల్ట్ ఫ్యామిలీ స్టార్ కి రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ లో లక్కీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విజయ్ తో జత కట్టింది. ఆమె గోల్డెన్ హ్యాండ్ ని బట్టి చూస్తే కూడా ఈ సినిమా కచ్చితంగా హిట్ అనే చెప్పొచ్చు.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా వస్తుందని తెలుస్తుంది. మళ్లీ రావా సినిమాతో దర్శకుడిగా మొదటి ప్రయత్నం తోనే సక్సెస్ అందుకున్న గౌతం తిన్ననూరి నానితో జెర్సీ సినిమాతో ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేశాడు. అదే సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసి అక్కడ మంచి ఫలితాన్ని అందుకున్నాడు.

జెర్సీ తర్వాత విజయ్ తో సినిమా చేస్తున్నాడు గౌతం. ఈ సినిమా విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో విజయ్ క్యారెక్టర్, స్టైల్ అంతా చాలా కొత్తగా ఉంటాయని టాక్. సితార బ్యానర్ ఇప్పటివరకు టైర్ 2 హీరోలతో చేసిన సినిమాల్లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ అని అంటున్నారు. విజయ్ దేవరకొండ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్.

ఖుషి సినిమా విజయ్ కి కమర్షియల్ గా కాస్త పర్వాలేదని అనిపించినా సరే ఫ్యామిలీ స్టార్ తో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక గౌతం తిన్ననూరి సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. విజయ్ గౌతం ఎలాంటి అవుట్ పుట్ తో వస్తారన్నది చూడాలి. ఈ సినిమా తర్వాత విజయ్ రెండు క్రేజీ కాంబినేషన్స్ తో సినిమాలు చేయబోతున్నాడని తెలుస్తుంది. ఆ ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.