Begin typing your search above and press return to search.

ఆ బ్యానర్ లో విజయ్ సినిమా ఏమైనట్టు..?

ఒక సాలిడ్ హిట్ తో కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న విజయ్ దేవరకొండకు నిరాశే మిగులుతుంది.

By:  Tupaki Desk   |   1 May 2024 3:00 AM GMT
ఆ బ్యానర్ లో విజయ్ సినిమా ఏమైనట్టు..?
X

మొదటి రెండు సినిమాలతోనే తన టాలెంట్ చూపించి రౌడీ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తన కెపాసిటీకి తగిన కథలు పడట్లేదని చెప్పొచ్చు. అఫ్కోర్స్ కథల సెలక్షన్ లో విజయ్ దేవరకొండ పడుతున్న కన్ ఫ్యూజన్ అతని సినిమాల ఫలితాలతో తెలుస్తుంది. అర్జున్ రెడ్డితో తనకంటూ ఒక మాస్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు కానీ ఇది తన టాలెంట్ అని ప్రూవ్ చేసుకున్నది లేదు. ఒక సాలిడ్ హిట్ తో కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న విజయ్ దేవరకొండకు నిరాశే మిగులుతుంది.

విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ద ఫ్యామిలీ స్టార్ కూడా డిజప్పాయింట్ చేసింది. దిల్ రాజు బ్యానర్ లో పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ సితార బ్యానర్ లో గౌతం తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తుంది. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా రౌడీ స్టార్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మళ్లీ దిల్ రాజు బ్యానర్ లోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది. రవికిరణ్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. అయితే విజయ్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయాలని అల్లు అరవింద్ అనుకున్నారు. పరశురామ్ డైరెక్షన్ లోనే ఆ సినిమా చేయాలని అనుకున్నా అక్కడ కాదని వచ్చి దిల్ రాజుతో సినిమా చేశాడు పరశురాం.

డైరెక్టర్ తో ఎలాగు ఇక మీదట చేయకూడదని అనుకున్న గీతా ఆర్ట్స్ హీరోతో కూడా సినిమా చేసేందుకు ముందుకు రావట్లేదు. అయితే విజయ్ మాత్రం మంచి కథతో వస్తే గీతా ఆర్ట్స్ లో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. గీతా గోవిందం లాంటి హిట్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ లో విజయ్ సినిమా చేసేందుకు సుముఖంగానే ఉన్నాడు. మరి ఆ బ్యానర్ లో విజయ్ దేవరకొండ సినిమా ఎప్పుడు ఉంటుంది అన్నది చూడాలి. విజయ్ నెక్స్ట్ రెండు సినిమాలు మిస్ అవ్వగా తర్వాత అయినా ఈ కాంబో కుదురుతుందేమో చూడాలి. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 లో నాగ చైతన్యతో తండేల్ సినిమా వస్తుంది. ఈ సినిమాను చైతు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో చేస్తున్నారు.