Begin typing your search above and press return to search.

విజయ్ సినిమా ఆగలేదు గ్యాప్ ఇచ్చారు..!

విజయ్ గౌతం తిన్ననూరి గ్యాప్ ఇచ్చారు కానీ సినిమా క్యాన్సిల్ చేయలేదు. త్వరలోనే మళ్లీ ఈ ఇద్దరు కలిసి వారు చేయబోయే స్పై థ్రిల్లర్ కోసం కలిసి పనిచేస్తారు.

By:  Tupaki Desk   |   29 Jan 2024 6:36 PM GMT
విజయ్ సినిమా ఆగలేదు గ్యాప్ ఇచ్చారు..!
X

ది విజయ్ దేవరకొండ సినిమా అంటే యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అతను చేస్తున్న సినిమాలు ఫలితాలు ఎలా ఉన్నా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని మాత్రం అలరిస్తాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. గీతా గోవిందం కాంబినేషన్ కాబట్టి అదే రేంజ్ రిజల్ట్ ని ఆశిస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.

ఇక ఈ సినిమా తో పాటుగా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో పెట్టాడు విజయ్ దేవరకొండ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చారని తెలుస్తుంది. విజయ్ ఫ్యామిలీ స్టార్ సమ్మర్ రిలీజ్ చేయాల్సి ఉండగా ఆ సినిమాను పూర్తి చేసే ఆలోచనతో గౌతం తిన్ననూరి సినిమాకు బ్రేక్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ గ్యాప్ లో గౌతం తిన్ననూరి మ్యాజిక్ అనే సినిమా చేస్తున్నారు.

అది కూడా సితార బ్యానర్ తెరకెక్కిస్తున్న సినిమానే ఈ సినిమాలో సారా అర్జున్ నటిస్తుంది. సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే గౌతం తిన్ననూరి ఈ సినిమా చేస్తున్నాడు అనేసరికి విజయ్ సినిమా క్యాన్సిల్ అయ్యిందని అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ పూర్తి చేసే లోగా ఈ సినిమాను ఫినిష్ చేయాలని గౌతం తిన్ననూరి టార్గెట్ పెట్టుకున్నాడు.

విజయ్ గౌతం తిన్ననూరి గ్యాప్ ఇచ్చారు కానీ సినిమా క్యాన్సిల్ చేయలేదు. త్వరలోనే మళ్లీ ఈ ఇద్దరు కలిసి వారు చేయబోయే స్పై థ్రిల్లర్ కోసం కలిసి పనిచేస్తారు. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక గౌతం తిన్ననూరి సినిమా రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేం. జెర్సీ సినిమాతో తెలుగులో హిట్ కొట్టిన గౌతం అదే సినిమా హిందీలో తీసి అక్కడ అదరగొట్టాడు. విజయ్ తో చేస్తున్న స్పై థ్రిల్లర్ తో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు గౌతం తిన్ననూరి. విజయ్ సినిమా కూడా ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. విజయ్ కూడా ఈ సినిమాతో గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తుండగా.. రుక్మిణి వసంత్ తో పాటుగా యానిమల్ త్రిప్తి డిమ్రి మరో హీరోయిన్ గా తీసుకుంటారని టాక్.