Begin typing your search above and press return to search.

విజయ్‌ లవ్ రష్మిక... బాలయ్య చాలా ట్రై చేశాడు

ఈ ముగ్గురితో పాటు ఫోన్ లైన్ ద్వారా రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ కూడా అందుబాటులోకి వచ్చాడు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 6:26 AM GMT
విజయ్‌ లవ్ రష్మిక... బాలయ్య చాలా ట్రై చేశాడు
X

నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్‌ స్టాపబుల్‌ తాజా ఎపిసోడ్‌ లో యానిమల్ చిత్ర యూనిట్‌ సభ్యులు రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్న, సందీప్ వంగలు పాల్గొన్నారు. ఈ ముగ్గురితో పాటు ఫోన్ లైన్ ద్వారా రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ కూడా అందుబాటులోకి వచ్చాడు. ప్రోమో విడుదల అయిన సమయంలో విజయ్‌, రష్మిక లవ్‌ స్టోరీకి క్లారిటీ వస్తుందా అని అంతా అనుకున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గీత గోవిందం సమయం నుంచి కూడా ప్రేమలో ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య కొన్ని సాక్ష్యాలు కూడా మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యాయి. అయినా కూడా ఇప్పటి వరకు ఇద్దరు కూడా తాము స్నేహితులం అంటూ చెబుతున్నారు. వారి నోటి నుంచి క్లారిటీ కోసం ప్రతి ఒక్కరు వెయిట్‌ చేస్తున్నారు.

యానిమల్‌ సినిమా ప్రమోషన్ కోసం అన్‌ స్టాబుల్‌ షో కి వచ్చిన రష్మిక మందన్న తో విజయ్ దేవరకొండ గురించి చెప్పిందుకు బాలయ్య చాలానే ట్రై చేశాడు. కానీ అటు విజయ్ కానీ, ఇటు రష్మిక మందన్న కానీ తమ ప్రేమ విషయాన్ని బాలయ్య ముందు ఒప్పేసుకోలేదు. చాలా తెలివిగా సమాధానం దాటవేశారు.

బాలయ్య లవ్స్ రష్మిక.. మరి నువ్వు ఎవరిని లవ్‌ చేస్తున్నావు అంటూ బాలకృష్ణ చాలా తెలివిగా విజయ్ దేవరకొండ ను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మరింత తెలివిగా విజయ్ దేవరకొండ సమాధానం ఇస్తూ తాను సందీప్ ను ప్రేమిస్తున్నాను అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు. ఇక రష్మిక కూడా విజయ్ దేవరకొండ టాపిక్ వచ్చినప్పుడు సిగ్గు పడిందే తప్ప క్లారిటీ సమాధానం ఇవ్వలేదు.

మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఉన్నది స్నేహం కాదు ప్రేమ అని బాలయ్య చెప్పించేందుకు చాలానే కష్టపడ్డాడు కానీ వారు మాత్రం అస్సలు నోరు జారలేదు, అస్సలు క్లారిటీ ఇవ్వలేదు. దాంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని నమ్ముతున్న వారు క్లారిటీ కోసం మరికొంత కాలం వెయిట్‌ చేస్తామని అంటున్నారు.

ఇంతకు వారిద్దరూ ప్రేమలో ఉన్నారా లేదా అనేది చాలా మందికి అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. క్రేజ్‌ కోసం ఇలాంటి ప్రచారాలు కొందరు కావాలని చేయించుకుంటూ ఉంటారు. కానీ ఆ ప్రచారం వీరికి అవసరం లేదు. కనుక కచ్చితంగా ఇద్దరి మధ్య ఏదో ఉండే ఉంటుంది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ఏముందో కాలమే సమాధానం చెప్పాలి.