Begin typing your search above and press return to search.

చివరి సినిమా @ రూ.200 కోట్లు పారితోషికం

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ రాజకీయ అరంగేట్రంకు సిద్ధం అయ్యాడు. దాదాపు అయిదు ఆరు సంవత్సరాలుగా విజయ్ రాజకీయ అరంగేట్రం గురించి చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 9:30 AM GMT
చివరి సినిమా @ రూ.200 కోట్లు పారితోషికం
X

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ రాజకీయ అరంగేట్రంకు సిద్ధం అయ్యాడు. దాదాపు అయిదు ఆరు సంవత్సరాలుగా విజయ్ రాజకీయ అరంగేట్రం గురించి చర్చ జరుగుతోంది. ఆ మధ్య అభిమాన సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. అప్పుడే విజయ్ రాజకీయ అరంగేట్రం ఖాయం అని అంతా అనుకున్నారు.


వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు కచ్చితంగా విజయ్ తన రాజకీయ పార్టీతో ప్రజల్లోకి వెళ్లే ఉద్దేశ్యంతో ఉన్నాడు. అందుకు గాను గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటూ ఉన్నాడు. సినిమాకు వంద కోట్లకు మించి పారితోషికం తీసుకుంటూ ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్న విజయ్‌ ఇకపై ఇండస్ట్రీకి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం చేస్తున్న సినిమా కాకుండా మరో సినిమాను విజయ్ కమిట్ అయ్యాడు. ఆ సినిమాను మన తెలుగు నిర్మాత దానయ్య నిర్మించబోతున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత చిన్నా పెద్ద సినిమాలను వరుసగా నిర్మిస్తున్న దానయ్య తాజాగా విజయ్‌ డేట్లను దక్కించుకున్నాడని తెలుస్తోంది.

ఇంకా దర్శకుడు కన్ఫర్మ్‌ అవ్వలేదు.. కానీ విజయ్ డేట్లను మాత్రం దానయ్య దక్కించుకున్నాడట. దానయ్య ఇచ్చిన రూ.200 కోట్ల పారితోషికం ఆఫర్‌ కారణంగానే విజయ్ ఆ సినిమాను కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దానయ్య బ్యానర్ లో చేయబోతున్న సినిమా విజయ్ కి చివరి సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

రాజకీయాల్లో ప్రభావితం చూపించినా, చూపించకున్నా కూడా విజయ్ సినిమాలకు తిరిగి వెళ్ల కూడదనే భావిస్తున్నాడట. అందుకే ఈ లోపు సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలు చేయాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ హీరోల్లో రూ.200 కోట్ల పారితోషికం అందుకోబోతున్న మొదటి హీరోగా విజయ్ నిలిచే అవకాశాలు ఉన్నాయి.

విజయ్‌ సినిమా మినిమం టాక్‌ వచ్చినా కూడా ఈజీగా 250 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉంటుంది. ఇక హిట్ అయితే అన్ని రకాలుగా కలిపి రూ.500 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.