Begin typing your search above and press return to search.

విజయ్ చివరి పొలిటికల్ టచ్.. అసలైన దర్శకుడే..

అతను ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడి ఒక వారంలో వెనక్కి వస్తుంది.

By:  Tupaki Desk   |   5 March 2024 3:15 AM GMT
విజయ్ చివరి పొలిటికల్ టచ్.. అసలైన దర్శకుడే..
X

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా అందులో ఒక్కొక్కరికి ఒకే తరహాలో ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో అయితే అత్యధిక స్థాయిలో మార్కెట్ పెంచుకుంటూ వెళ్లిన హీరోలలో విజయ్ టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. అతను ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడి ఒక వారంలో వెనక్కి వస్తుంది. అంతలా విజయ్ తన మార్కెట్ను పెంచుకుంటూ వెళ్ళాడు.

అయితే ఈ సమయంలోనే అతను రాజకీయాల్లోకి రావాలని అనుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. విజయ్ ప్రత్యక్షంగా ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తాను అని దీటుగా మాత్రం సమాధానాలు ఇవ్వలేదు. ఇక సోషల్ మీడియాలో ఒక లేఖ ద్వారా మొత్తానికి క్లారిటీ ఇచ్చినప్పటికీ ఎప్పుడు ఎలా మొదలుపెడతాడు? అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

అంతే కాకుండా విజయ్ ఎంతోకాలంగా గ్రౌండ్ లెవెల్ లోనే తన రాజకీయ శక్తిని బలపడేలా ప్లాన్ చేసుకున్నాడు అని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక అతను సినిమాలకు కూడా దూరంగా ఉంటాడు అనే కంగారు మొదలైంది. ఇక భవిష్యత్తులో విజయ్ సినిమాలు చేస్తారో చేయడో కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేసే చివరి సినిమాలు మాత్రం చాలా బలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో GOAT సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ గా ఉండబోతోంది. అలాగే టాలీవుడ్ ప్రొడ్యూసర్ దానయ్య ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం. విజయ్ రెమ్యునరేషన్ ఇప్పుడు దాదాపు 150 కోట్లు చేరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అతనితో డైరెక్ట్ చేసినందుకు కొంతమంది దర్శకుల పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.

అయితే విజయ్ పొలిటికల్ ఇమేజ్ కి సరిపోయే సినిమా చేయగల దర్శకుడు ఒకే ఒక్కడు అంటూ అట్లీ పేరు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతుంది. అట్లీ దర్శకత్వంలో ఇంతకుముందు విజయ్ చేసిన తేరీ, మెర్సల్, బిగిల్.. సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా విజయ్ మార్కెట్ ని కూడా పెంచాయి.

అయితే ఇప్పుడు విజయ్ చివరి సినిమా అతనితో చేయాలని అనుకుంటున్నాట్లుగా తమిళనాడులో కొత్త తరహా టాక్ అయితే మొదలైంది. ఆ సినిమా కూడా విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటివరకు అట్లీ ఖాతాలో కూడా కమర్షియల్ ఫ్లాప్ అయిన సినిమా లేదు. కాబట్టి నమ్మకమైన కాంబినేషన్ అని చెప్పవచ్చు. మరి ఇది ఎంతవరకు మవుతుందో కానీ పక్కా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనే కామెంట్స్ వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.