Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్ డబుల్ యాక్షన్.. టైటిల్ ఇదేనా!

విజయ్ రాబోయే సినిమాలు గతంలో కంటే చాలా భిన్నంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   22 May 2024 3:30 AM GMT
రౌడీ స్టార్ డబుల్ యాక్షన్.. టైటిల్ ఇదేనా!
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత మరింత వేగాన్ని పెంచాడు. ఇక ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకూడదు అని ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టాడు. అందులో అతను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. విజయ్ రాబోయే సినిమాలు గతంలో కంటే చాలా భిన్నంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

యాక్షన్ తో పాటు మిస్టరీ థ్రిల్స్ ఉండే విధంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అలాగే ఎమోషన్ కూడా ఎక్కడ మిస్ కాకూడదు అని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యన్ తో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాకు దాదాపు 200 కోట్లు బడ్జెట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ చాలా బిజీగా ఉన్నారు. ఇక విజయ్ దేవరకొండ ఈ కథలో రెండు క్యారెక్టర్స్ తో కనిపించబోతున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో బ్రిటిష్ నేపథ్యమున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా సినిమాల్లో మేజర్ హైలెట్ పాయింట్ అని సమాచారం. ఒక వైపు తండ్రిగా మరొకవైపు భవిష్యత్తు వారసుడిగా విజయ్ నటించే విధానం సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం రణబలి అనే టైటిల్ పైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ అయితే సినిమా కంటెంట్ కు చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని ఆలోచిస్తున్నారట. అలాగే మరొక రెండు టైటిల్స్ కూడా చర్చల దశలో ఉన్నాయట. కానీ అందరి ఫోకస్ మాత్రం రణబలి అనే టైటిల్ పైనే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాల్లో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిట్ కాంబినేషన్ గా గుర్తింపు అందుకున్న ఈ జోడి మరోసారి వెండితెరపై కనిపించడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా వీరి కలయికలో వచ్చిన గీత గోవిందం సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డియర్ కామ్రేడ్ అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కెమిస్ట్రీ తో మాత్రం బాగా మెప్పించారు. మరి ఇప్పుడు రాబోయే కొత్త ప్రాజెక్టులో ఏ విధంగా కనిపిస్తారో చూడాలి