Begin typing your search above and press return to search.

దళపతి G.O.A.T.. ఇవానా జస్ట్ మిస్..!

అయితే G.O.A.T సినిమాకు మాత్రం ఇవానా నో చెప్పేసిందట. విజయ్ సినిమా అయినా కూడా అమ్మడు కాదని చెప్పడానికి ఒక రీజన్ ఉందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 8:30 AM GMT
దళపతి G.O.A.T.. ఇవానా జస్ట్ మిస్..!
X

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ G.O.A.T సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టైం ట్రావెల్ కథతో వస్తుందని తెలుస్తుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ తో సినిమా రాబోతుందని టాక్. సినిమాలో హీరోయిన్ గా కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టి నటిస్తుండగా ఈ ప్రాజెక్ట్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ కి లవ్ టుడే హీరోయిన్ ఇవానాని తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట.

మామూలుగా అయితే కోలీవుడ్ లో ఏ హీరోయిన్ అయినా దళపతి సినిమా ఛాన్స్ అంటే ఎగిరి గంతేసి ఆ ఆఫర్ కి ఓకే చెబుతారు. అయితే G.O.A.T సినిమాకు మాత్రం ఇవానా నో చెప్పేసిందట. విజయ్ సినిమా అయినా కూడా అమ్మడు కాదని చెప్పడానికి ఒక రీజన్ ఉందని తెలుస్తుంది. సినిమాలో ఇవానాని విజయ్ చెల్లి పాత్ర కోసం అడిగారట. స్టార్ సినిమా అంటే చాలు ఎలాంటి పాత్ర వచ్చినా చేసేద్దామని అందరు అనుకుంటారు.. కానీ ఇవానా మాత్రం విజయ్ సిస్టర్ రోల్ చేస్తే తర్వాత అన్ని అలాంటి రోల్సే వస్తాయని ఆ అవకాశాన్ని వద్దనుకుందట.

లవ్ టుడే హీరోయిన్ గా సూపర్ హిట్ అందుకున్న ఇవానా ఆ సినిమాతో తమిళంలోనే కాదు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తమిళంలో కాల్వన్ సినిమా చేస్తున్న అమ్మడు తెలుగులో ఆశిష్ రెడ్డి హీరోగా చేస్తున్న సెల్ఫిష్ లో నటిస్తుంది. హీరోయిన్ గా చేస్తున్న ఇలాంటి టైం లో విజయ్ సిస్టర్ గా చేస్తే కచ్చితంగా ఆమె కెరీర్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది.

ఇవానా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు కరెక్టే అని సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మాత్రం దళపతి సినిమాలో ఛాన్స్ వదులుకోకుండా ఉండాల్సిందని సలహా ఇస్తున్నారు. విజయ్ G.O.A.T సినిమాలో ఇవానా వదులుకున్న ఆ పాత్రని మోడల్ అభియుక్త చేసిందని తెలుస్తుంది. G.O.A.T సినిమాను ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ దసరాకి లియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఈ సినిమాతో కూడా తన మార్క్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ తెలుగు నిర్మాత డివివి దానయ్య ప్రొడక్షన్ లో ఒక భారీ సినిమా చేస్తారని టాక్. ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.