Begin typing your search above and press return to search.

లియో ట్రైలర్ ఎఫెక్ట్.. థియేటర్లు నాశనం

అయితే ఎందుకనో లియో ట్రైలర్ ఫ్యాన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం కూడా ఉంది. చెన్నైలో రోహిణి సినిమాస్ థియేటర్ ని విజయ్ ఫ్యాన్స్ మొత్తం ద్వంసం చేశారు.

By:  Tupaki Desk   |   6 Oct 2023 6:06 AM GMT
లియో ట్రైలర్ ఎఫెక్ట్.. థియేటర్లు నాశనం
X

ఇళయదళపతి విజయ్ నటించిన లియో మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ అక్టోబర్ 19న థియేటర్స్ లోకి రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతోన్న ఈ సినిమాపై 200 కోట్లకి పైగా థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. తాజాగా మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ ని లోకేష్ కనగరాజ్ సిద్ధం చేశారు. విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ఆవిష్కరించారు. అయితే ఎందుకనో లియో ట్రైలర్ ఫ్యాన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం కూడా ఉంది. చెన్నైలో రోహిణి సినిమాస్ థియేటర్ ని విజయ్ ఫ్యాన్స్ మొత్తం ద్వంసం చేశారు.

లియో ట్రైలర్ థియేటర్స్ లో ప్రదర్శించిన తర్వాత ఫ్యాన్స్ ఒక్కసారిగా అదుపుతప్పి థియేటర్ లో చైర్స్ మొత్తం నాశనం చేశారు. ఫర్నీచర్ ద్వంసం చేశారు. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రైలర్ నచ్చకపోవడం వలనే ఫ్యాన్స్ ఆగ్రహంతో ఇలా థియేటర్ మొత్తం నాశనం చేసినట్లు తెలుస్తోంది.

ఈ థియేటర్ ద్వంసం కావడంతో లక్షల్లో థియేటర్ ఓనర్ కి నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై అతను కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ ఫ్యాన్స్ లియో సినిమాపై ఎన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో అర్ధం అవుతోంది. మరి దీనికి ఏమైనా ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి సమాధానం వస్తుందా అనేది చూడాలి.

ఇదిలా ఉంటే మరో వైపు లియో ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని భాషలలో కలిపి 50 మిలియన్స్ కి దగ్గరగా వచ్చింది. అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోవడం రికార్డ్ గా ఉంది. మరి సినిమా అక్టోబర్ 19న ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.