Begin typing your search above and press return to search.

ఖుషి విషయంలో విజయ్ ఫ్యాన్స్ టెన్షన్..!

మరి అలాంటివి లేకుండా విజయ్ సినిమా వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి.

By:  Tupaki Desk   |   26 Aug 2023 5:30 AM GMT
ఖుషి విషయంలో విజయ్ ఫ్యాన్స్ టెన్షన్..!
X

వరుస ఫ్లాపులు వస్తున్నా ఫ్యాన్ క్రేజ్ లో ఏమాత్రం తగ్గని విజయ్ దేవరకొండ తన అభిమానులకు ఖుషితో ఒక మంచి సినిమా సినిమా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. విజయ్ దేవరకొండ సరసన సమంత కథానాయికగా నటించిన ఈ ఖుషి సినిమా లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది. ప్రచార చిత్రాలన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి.

అయితే ట్రైలర్ చూస్తే విజయ్ సమంతల ప్రేమ ఆ తర్వాత పెళ్లి ఎమోషనల్ డ్రామా ఉంటున్నట్టు తెలుస్తుంది. విజయ్ సినిమాలో ఉండాల్సిన బోల్డ్ సీన్స్, ఇంకా ఫైట్స్ అనేవి ఉన్నాయా అన్న డౌట్ కలుగుతుంది. సినిమా శివ నిర్వాణ తన స్టైల్ లో మరీ క్లాస్ గా తీశాడా అన్న ఆలోచన ఉంది.

విజయ్ సినిమా అంటే ఫ్యాన్స్ అంతా కూడా కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలు డిమాండ్ చేస్తారు. మరి అలాంటివి లేకుండా విజయ్ సినిమా వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి.

విజయ్ దేవరకొండ మాత్రం సినిమా ట్రైలర్ రొటీన్ గా అనిపించినా కథనం కచ్చితంగా అందరినీ టచ్ చేస్తుందని.. ఎమోషనల్ సీన్స్ చాలా బలంగా ఉంటాయని చెబుతున్నాడు. సమంతతో తన సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయని ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చాడు. డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత విజయ్ ప్రతి సినిమా భారీ అంచనాలతో రావడం ఆఫ్టర్ రిలీజ్ నిరాశ పరచడం చూస్తూనే ఉన్నాం.

అయితే ఖుషి సినిమాకు మాత్రం ఆహా ఓహో అనే రేంజ్ లో కాకుండా సెటిల్డ్ గానే ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాపై అనవసరమైన అంచనాలు పెంచి ఆడియన్స్ ఏదో ఊహించి వెళ్తే మళ్లీ రిజల్ట్ తేడా వస్తుందని విజయ్ చాలా కూల్ గా ప్రశాంతంగా ఖుషి ప్రమోషన్స్ చేస్తున్నాడు. విజయ్ కి మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా అర్జున్ రెడ్డి అయితే గీతా గోవిందం టాక్సీవాలా సినిమాల్లో కూడా క్లాస్ గా కనిపించి హిట్ కొట్టాడు.

మరి ఖుషి కూడా అదే తరహా ప్లాన్ తో వస్తున్నాడు కాబట్టి హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. విజయ్ దేవరకొండ కోరుకుంటున్న హిట్ సినిమాగా ఖుషి విజయ పతాకాన్ని ఎగుర వస్తుందా లేదా అన్నది చూడాలి. సమంత కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది.